How bridge seen is created in RRR movie with VFX RRR సినిమాలో బ్రిడ్జీ సీన్ గ్రాఫిక్స్ లో ఇలా చేశారా(వీడియో)

        RRR సినిమాలో బ్రిడ్జీ సీన్... గ్రాఫిక్స్ లో ఇలా చేశారా

Image Credit: Twitter

 బాహుబలి, బాహుబలి-2 తర్వాత దర్శకధీరుడు రాజమౌళి చేసిన విజువల్ వండర్ సినిమా RRR. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైన ఈ సినిమా 1200 కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టింది. టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఇద్దరు కథనాయకులుగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించారు. జూనియర్ ఎన్టీఆర్ కొమురమ్ భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలరించారు. 

 ఇక సినిమా నిర్మాణ విషయానికి వస్తే అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో దర్శకధీరుడు రాజమౌళి రూపుదిద్దారు. సినిమాలో కనిపించిన గ్రాఫిక్స్ తో నభూతో నభవిష్యతి అన్న విధంగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రత్యేకంగా చిత్రంలో వచ్చే బ్రిడ్జి యాక్షన్ సీన్ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తుంది. ఇంతకీ ఈ అద్భుతమైన సీన్ చక్కగా రావడం వెనుక గ్రాఫిక్స్ మాయాజాలం చాలానే ఉంది. నదిలో ఓ చిన్న పిల్లాడిని కాపాడేందుకు కథానాయకులు ఇద్దరు చేసిన ఈ ప్రయత్నమే బ్రిడ్జి యాక్షన్ సీన్. వంతెనపై రైలుకు మంటలు అంటుకుని ప్రమాదం జరగడంతో ట్రెయిన్ నదిలో పడిపోతుంది. ఈ క్రమంలో నీటిలోనూ మంటలు చెలరేగుతాయి. ఆ మంటల మధ్యలో నదిలో చేపలు పడుతున్న ఓ పిల్లాడు చిక్కుకుని ఉంటాడు. ఆ పిల్లాన్ని కాపాడేందుకు ఇద్దరు హీరోలు చేసిన ప్రయత్నాన్ని అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు రాజమౌళి. గ్రాఫిక్స్ మాయాజాలంతో ఈ సీన్ అద్భుతంగా పండింది. ఐతే ఆ సీన్ రూపొందించేందుకు గ్రాఫిక్స్ నిపుణులు ఎలాంటి ప్రయత్నాలు చేశారన్న దానిపై ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో చూస్తే ఎవరైనా థ్రిల్ ఫీలవడం కావడం. ఆ వీడియోను మీరూ చూడండి. 


RRR Movie బ్రిడ్జి సీన్ వీడియో కోసం క్లిక్ చేయండి



Post a Comment

Previous Post Next Post