'వాట్సప్'లో 3 రెడ్ టిక్స్ ఉంటే మీపై నిఘా ఉన్నట్టా?
సోషల్ మీడియా విపరీతంగా ఉపయోగిస్తున్న ఈ సమయంలో ఎలాంటి సమాచారమైనా త్వరగా అందరికీ చేరిపోతోంది. అలాగే ఫేక్ ఇన్ఫర్మేషన్ లేదా మిస్ ఇన్ఫర్మేషన్ కూడా అంతే వేగంగా అందరికీ అందుతోంది. ముఖ్యంగా వాట్సప్ లాంటి సామాజిక మాధ్యమంలో చాలా మంది తమకు వచ్చిన సమాచారాన్ని సరైనదో కాదో నిర్ధారించుకోకుండానే ఇతరులకు పంపిస్తున్నారు. ఈ కారణంగా మిస్ ఇన్ఫర్మేషన్ అనేది వేగంగా ఫార్వర్డ్ అవుతోంది.
వీడియోలో ఏముంది?
తాజాగా అలాంటిదే ఓ మెసేజ్ వీడియో రూపంలో వైరల్ అవుతోంది. ఇది వాట్సప్ లో మూడు రెడ్ టిక్ లకు సంబంధించిన వీడియో. ఇందులో మూడు రెడ్ టిక్ లకు సంబంధించి ఫేక్ ఇన్ఫర్మేషన్ వ్యాప్తి చేస్తున్నారు. వీడియోలో ఏం చెబుతున్నారంటే.. ఒకవేళ మూడు రెడ్ టిక్ లు వాట్సప్ మెసేజ్ పై పడితే ప్రభుత్వం నుంచి ఎప్పుడైనా సమన్లు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే ఒక బ్లూ టిక్, రెండు రెడ్ టిక్స్ కనుక పడితే ప్రభుత్వం మీ డేటాను పరీక్షిస్తోందని చెబుతున్నారు. అంతే కాదు రెండు బ్లూ టిక్ లు, ఒక రెడ్ టిక్ ఉంటే మీ వాట్సప్ మెసేజ్ ప్రభుత్వం దృష్టికి వెళ్లినట్లు అర్థమని చెబుతున్నారు.
ఐతే వాట్సప్ లో వైరల్ అవుతున్న ఈ వీడియోలు, మెసేజ్ లపై PIB Fact check స్పందించింది. ఇవన్నీ ఫేక్ న్యూస్ లని వీటిని ఎవరూ ఫార్వర్డ్ చేయవద్దని ట్వీట్ చేసింది. ఐతే PIB 2020 ఏప్రిల్ లోనే ఈ అంశాన్ని ధృవీకరిస్తూ ట్వీట్ చేసినప్పటికీ 2022లోనూ ఇలాంటి మిస్ ఇన్ఫర్మేషన్ ఇంకా వైరల్ అవుతుండడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఫేక్ న్యూస్ అని రెండేళ్ల క్రితమే చెప్పినప్పటికీ ఇది ఎలా విస్తరిస్తుందో మనం అర్ధం చేసుకోవచ్చు.
#Fake News Alert !
— PIB Fact Check (@PIBFactCheck) April 7, 2020
Messages circulating on Social Media reading 'WhatsApp info regarding √ tick marks' is #FAKE.#PIBFactCheck : No! The Government is doing no such thing. The message is #FAKE.
Beware of rumours! pic.twitter.com/GAGEnbOLdY
Read Also: టమాటోతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేవి?
కాబట్టి వాట్సప్ లో వచ్చే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ను ధృవీకరించుకోవాలని వాట్సప్ సంస్థ కోరుతోంది. వాట్సప్ ను దేశంలో 45 కోట్ల మంది వినియోగిస్తున్నారు. అత్యధిక యూజర్ల కారణంగా వాట్సప్ లో మిస్ ఇన్ఫర్మేషన్ వ్యాప్తి జరుగుతోంది. ఐతే ఇప్పటికే ఫేక్ న్యూస్ లపై సంస్థ దృష్టిసారించింది. మెసేజ్ లకు 'Forwarded' అనే ట్యాగ్ తగిలించింది. అలాగే ఒకవేళ మన దగ్గరి వాళ్లు లేదా మనం ఉన్న గ్రూపుల నుంచి ఈ మేసేజ్ రానిపక్షంలో అలాంటి వాటికి 'Forwarded many times' ట్యాగ్ ఉంటుంది. వీటిని జాగ్రత్తగా గమనించాలని.. వెంటనే ఎవరికీ ఫార్వర్డ్ చేయకుండా మెసేజ్ లేదా వీడియోలోని ఇన్ఫర్మేషన్ సరైనదో కాదో నిర్ధారించుకోవాలని సంస్థ సూచిస్తోంది. అలాగే ఫేక్ ఇన్ఫర్మేషన్ విపరీతంగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మేసేజ్ ఫార్వర్డ్ పరిమితిని ఐదు కాంటాక్టులకు లేదా గ్రూపులకు వాట్సప్ పరిమితం చేసింది.
Follow us on:
Join us in Telegram channel: 👉 https://t.me/URnewstag
Note: ఫేక్ ఇన్పర్మేషన్ వ్యాప్తి చేయకుండా కింద వాట్సప్ లింక్ ద్వారా మీ వాట్సప్ గ్రూపులలో ఈ స్టోరీ ఫార్వార్డ్ చేయండి.