(వీడియో)ర్యాంప్ వాక్ ఇలా కూడా చేస్తారా?

            ర్యాంప్ వాక్ ఇలా కూడా చేస్తారా?


 సోషల్ మీడియాలో కొంత మంది పంచుకునే వీడియోలో విపరీతంగా నవ్వు తెప్పిస్తుంటాయి. అలాంటి కోవకు చెందినదే ఈ ర్యాంప్ వాక్ వీడియో. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న నెటిజనులు ఫన్నీ కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇంటర్నెట్ ను ఇప్పుడు ఈ వీడియో షేక్ చేస్తోంది. దాదాపు లక్ష మంది ఈ వీడియోను వీక్షించారంటే వీడియో నెటిజనులను ఎంతగా ఆకట్టుకుందో అర్ధమవుతోంది. 

 ఈ వీడియోలో ఓ వ్యక్తి ర్యాంప్ వాక్ లను వ్యంగ్యంగా అనుకరించాడు. ఆధునిక కొత్త పోకడలతో దూసుకెళ్తున్న ఫ్యాషన్ రంగంలో ప్రస్తుతం ఎలాంటి ధోరణి ఉందో చెప్పకనే చెప్పేశాడు. సోషల్ మీడియాలో పలుమార్లు షేర్ లతో దూసుకుపోయిన ఈ వీడియోను డా. అజయిత అనే ట్విట్టర్ యూజర్ నెటిజనులతో పంచుకున్నారు. అంతే కాదు ' Most Fashion shows these days..' అనే క్యాప్షన్ కూడా జత చేశారు. ఆ వీడియోను మీరు కూడా చూసి నవ్వుకోండి.

(వీడియో) T Hub 2.0 లోపల ఎలా ఉందో చూశారా? 

Post a Comment

Previous Post Next Post