లైగర్ ట్రైలర్ రివ్యూ(Video)

                        లైగర్ ట్రైలర్ రివ్యూ


టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్(puri Jagannath), రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ(vijay devarakonda) కలయికలో రూపుదిద్దుకున్న సినిమా లైగర్(Liger). సాలా క్రాస్ బ్రీడ్ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు(July 21) విడుదలైంది. మాస్ ప్లస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ట్రైలర్ కట్ చేశారు. ఒక లయన్ కి టైగర్ కి పుట్టిండాడు.. క్రాస్ బ్రీడ్ సార్ నా బిడ్డ అంటూ రమ్యకృష్ణ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. చిత్రమేంటంటే గలగలా మాట్లాడే హీరో విజయ్ దేవరకొండకు సినిమాలో నత్తి ఉన్నట్లు చూపించారు. అంతే కాదు శారీరక లోపంతో హీరో విజయ్ నటించిన సినిమా ఇదే తొలి చిత్రం కానుంది. ట్రైలర్ లాంచ్ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు పూరీ జగన్నాథ్.. ఈ సినిమా రిలీజ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ రేంజ్ ఇండియా లెవల్లో మారుమోగిపోతుందని చెప్పారు. 

 ఇక ట్రైలర్ ను బట్టి చూస్తే మదర్ సెంటిమెంట్ బాగానే ఉన్నట్లు కనిపించింది. అలాగే స్ట్రీట్ ఫైటర్ నుంచి అంతర్జాతీయ స్థాయికి హీరో ఎదిగాడన్నది సినిమా కథాంశంగా తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బాక్సర్ మైక్ టైసన్ ముఖ్య పాత్రలో నటించారు. ట్రైలర్ ఐ యామ్ ఏ ఫైటర్ అని విజయ్ దేవరకొండ డైలాగ్ చెబితే.. చివరలో If you are a fighter.. What am I? అని మైక్ టైసన్ చెప్పడంతో ట్రైలర్ ముగుస్తుంది. 

 ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్ బ్యానర్లపై హీరోయిన్ ఛార్మీ, దర్శకుడు పూరీ జగన్నాథ్, బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనన్య పాండే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించింది. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, థీమ్ సాంగ్ విజయ్ దేవరకొండ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఇక ట్రైలర్ కు కూడా అదే రేంజ్ లో విజయ్ ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. 

Post a Comment

Previous Post Next Post