RRR సినిమాలో ఇంటర్వెల్ సీన్ ఎలా తీశారో తెలుసా?

               RRR సినిమాలో ఇంటర్వెల్ సీన్ ఎలా తీశారో తెలుసా? 



 బాహుబలి, బాహుబలి-2 చిత్రాల తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి చెక్కిన చలన చిత్ర శిల్పం RRR. ఈ సినిమా సూపర్ సక్సెస్ ను అందుకుని భారతీయ సినిమా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతోంది. థియేటర్లలోనే కాదు ఓటీటీలోనూ సినీ ప్రియుల ప్రశంసలు అందుకుంటోంది. సినిమాలో హీరోలు, హీరోయిన్లతోపాటు గ్రాఫిక్స్ ప్రధాన పాత్ర వహించాయి. ఒక్కో సీన్ అద్భుతంగా తీర్చి దిద్దారు. ఐతే గ్రాఫిక్స్ వర్క్ కు సంబంధించి కొన్ని కీలక అంశాలను చిత్ర బృందం ప్రేక్షకులతో పంచుకుంటోంది. ఇప్పటికే బ్రిడ్జి సీన్, కొమురం భీముడో.. పాటకు సంబంధించిన గ్రాఫిక్ వర్క్ ను యూనిట్ విడుదల చేసింది. తాజాగా హీరోలు రామ్ చరణ్, తారక్ మధ్య వచ్చే ఇంటర్వెల్ ఫైట్ సీన్ ను యూనిట్ రిలీజ్ చేసింది. అద్భుతంగా ఉన్న ఆ గ్రాఫిక్ వర్క్ ను మీరూ చూసేయండి. 




Post a Comment

Previous Post Next Post