F3 Movies OTT release (వీడియో) F3 సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యేది అప్పుడే

        F3 సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యేది అప్పుడే



హాట్ హాట్ సమ్మర్ లో కూల్ కూల్ సినిమా F3. ఇప్పటికే థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులకు.. ఎండ వేడిమిలోనూ ఆహ్లాదం పంచుతోంది. కామెడీతో చిన్నా, పెద్ద అందరినీ కడుపుబ్బా నవ్విస్తోంది. మే 27న రిలీజైన ఈ సినిమా ఇప్పటికీ సినీప్రియుల మన్ననలు పొందుతూ థియేటర్లలో దూసుకుపోతోంది. 



  ప్రస్తుతం అంతా ఓటీటీ(OTT)ల యుగం నడుస్తోంది. ఈ సినిమా కోసం కూడా ప్రేక్షకులు ఓటీటీ వైపు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఓటీటీలో రిలీజవుతుందని వేచి చూస్తున్నారు. ఐతే దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఓ వీడియో రిలీజ్ చేసింది. చిత్ర కథానాయకులు విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ తోపాటు దర్శకుడు అనిల్ రావిపూడి ఈ వీడియోలో.. F3 Movie ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియో మీరూ చూడండి. 

                        

 

 మరోవైపు థియేటర్లలో విజయవంతంగా ఈ సినిమా ప్రదర్శితమవుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా వేసవి సెలవులు ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయనే చెప్పవచ్చు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమాలో త‌మ‌న్నా, మెహ‌రీన్ కథానాయికలుగా నటించారు. మురళీ శర్మ, రాజేంద్రప్రసాద్, సునీల్ అలీ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.  

Read Also: ప్రీడయాబేటిక్ స్టేజీ అంటే ఏంటి? నియంత్రణ సాధ్యమేనా?

Post a Comment

Previous Post Next Post