(వీడియో) ఇలాంటి క్యాచ్ ఎప్పుడైనా చూశారా?

            ఇలాంటి క్యాచ్ ఎప్పుడైనా చూశారా?

 


 క్రికెట్ లో అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటప్పుడే ఆడే వారికి ఓ రకమైన మజా ఉంటే.. చూసే వారికి మరో రకమైన ఆనందం ఉంటుంది. ఇప్పుడు అలాంటి వీడియోనే ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఇంగ్లండ్ లోని విలేజ్ లీగ్ క్రికెట్ మ్యాచ్ లో ఓ బౌలర్ క్యాచ్ పట్టిన తీరు అద్భుతంగా ఉంది. అందరినీ థ్రిల్ కు గురి చేస్తోంది. 

 విలేజ్ లీగ్ లో భాగంగా ఆల్ డ్విక్ క్రికెట్ క్లబ్, లింగ్ ఫీల్డ్ క్రికెట్ క్లబ్ మధ్య ఓ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అలెక్స్ రైడర్ అనే బౌలర్ బౌలింగ్ చేశాడు. ఐతే బ్యాట్స్ మెన్ ఆ బంతిని కొట్టిన తర్వాత గాల్లోకి లేచి.. తిరిగి బౌలర్ వద్దకే వచ్చింది.  ఆ బంతిని క్యాచ్ పట్టేందుకు అలెక్స్ రైడర్ ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే పట్టుతప్పి కిందపడిపోయాడు. ఇంకేముంది.. డామిట్ బంతి కూడా క్యాచ్ మిస్సయింది అనుకున్నాడు. కానీ అనూహ్యాంగ్ అలెక్స్ శరీరంపై పడ్డ బాల్.. తిరిగి గాల్లోకి లేచింది. ఒక్క ఉదుటున లేచి తిరిగి బంతిని అందుకున్నాడు అలెక్స్. దీంతో బ్యాట్స్ మెన్ ఔట్ కాక తప్పలేదు. ఉసూరుమంటూ పెవిలివియన్ వైపు కదలకా తప్పలేదు. 

 వికెట్ మధ్యలో ఉంచిన సీసీ కెమెరాలో ఈ అద్భుతమైన క్యాచ్ దృశ్యం అంతా రికార్డైంది. ఇప్పుడా వీడియోన్ ఆల్ డ్విక్ క్రికెట్ క్లబ్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వీడియో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు అంతా అద్భుతమైన క్యాచ్ పట్టిన బౌలర్ ను ప్రశంసిస్తున్నారు. ఇలా కూడా క్యాచ్ పడతారా? అంటూ కొంత మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియో మీరు కూడా చూసేయండి. 


Read Also: రాంగ్ పార్కింగ్ క్లిక్ కొట్టు.. రూ. 500 నజరానా పట్టు

Read Also: రోజూ బాదం తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?

Post a Comment

Previous Post Next Post