తెలంగాణకు ‘ఎల్లో అలర్ట్’
తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ..IMD హెచ్చరించింది. అంతే కాదు తెలంగాణ రాష్ట్రానికి ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. ముఖ్యంగా శనివారం (జూన్ 18) నాడు ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ్ పేట్, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
Read Also: డెబిట్, క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్
ఆ తర్వాత జూన్ 19 ఆదివారం నాడు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట్, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఆయా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Read Also: పెట్రోలియం జెల్లీతో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా?
మరోవైపు శుక్రవారం నాడు కుమ్రం భీం ఆసిఫాబద్‌లో అత్యధికంగా 73.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆ తర్వాతి స్థానంలో 62.2 మిల్లీమిటర్ల వర్షపాతంతో సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ రెండో స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కూడా వానలు పడ్డాయి.
See Also: (వీడియో) క్రికెట్లో ఇలాంటి క్యాచ్ ఎప్పుడైనా చూశారా?