యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం
చక్కని ఆరోగ్యం కోసం శారీరక వ్యాయామం ప్రతి ఒక్కరికీ అవసరం. యోగా లాంటి వాటిని రోజూ అభ్యాసన చేస్తే శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుంది. ప్రతి రోజూ ఉదయం పూట యోగా చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా, చురుగ్గా ఉంటుంది. ఈ క్రమంలో యోగాతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో పూర్తిగా తెలుసుకుందాం.
శారీరక వ్యాయామం.. ఆరోగ్యానికి చక్కని మార్గం. ఉదయం లేదా సాయంత్రం నడవడం కావచ్చు లేదా ఎయిరోబిక్స్ (aerobics), జిమ్( Gym) లో చేసే కసరత్తులు కావచ్చు.. స్విమ్మింగ్ (Swimming), సైక్లింగ్ (Cycling) కావచ్చు.. శారీరక ఆరోగ్యానికి బాటలు వేస్తాయి. కండరాలు బలోపేతం కావడానికి సహాయపడతాయి. ఐతే యోగా (Yoga) చేయడం.. కేవలం శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తుంది. ఓ రకంగా ధ్యానంతో కలిగే ప్రయోజనాలన్నీ యోగా చేయడం ద్వారా కలుగుతాయని చెప్పవచ్చు. శ్వాస మీద ధ్యాస ఉంచగలిగే యోగాసనాల ద్వారా ఇది సాధ్యమవుతుంది.
యోగా అన్ని వయసుల వారు చేయవచ్చా?
యోగా ఏ సమయంలో చేయడం సత్ఫలితాలనిస్తుంది?
యోగా వల్ల చక్కని శరీరాకృతి కూడా సమకూరుతుంది. అంతే కాదు శరీరం వంగిపోతున్నా లేదా తూలిపడిపోతున్నా త్వరగా గమనించుకునే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి కిందపడిపోకుండా భంగిమను సర్దుబాటు చేసుకోవచ్చు. ఇక యోగా చేయడం వల్ల శ్వాస ప్రయోజనాలు కూడా కలుగుతాయి. శ్వాసపై ధ్యాస ఉంచడం అభ్యాసన అవుతుంది. నిర్దిష్ట శ్వాస ప్రక్రియకు అలవాటు కావడం వల్ల శరీరానికి మంచి విశ్రాంతి లభిస్తుంది. ఫలితంగా మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. తద్వారా క్రమంగా చక్కని మానసిక ఆరోగ్యం కూడా సొంతమవుతుంది.
Read Also: నడుం నొప్పి బాధిస్తోందా?ఇలా చేయండి
ప్రతి రోజూ యోగా చేయడం రక్తపోటును నియంత్రణలో ఉంచుతుందని.. అలాగే హృదయ స్పందనను క్రమబద్దీకరించేందుకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తపోటు అదుపులో ఉండడం వల్ల హృద్రోగ సమస్యలు, పక్షవాతం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉండదంటున్నారు. అంతే కాదు రోజూ యోగా చేయడం వల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. రోగ నిరోధక వ్యవస్థ మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది.
Read Also: కడుపు నొప్పి ఉన్నప్పుడు ఏం తినాలి?