వెన్ను నొప్పి బాధిస్తోందా? ఇలా చేయండి

                         వెన్ను నొప్పి బాధిస్తోందా? ఇలా చేయండి


 పని ఒత్తిడి.. విశ్రాంతి తక్కువగా ఉండడం ..  ఇలాంటి కారణాలతో  ఈ మధ్య కాలంలో చాలా మందిలో వెన్ను నొప్పి సమస్య తీవ్రమవుతోంది. వృద్ధులే కాకుండా యుక్తవయస్సు వారిలోనూ ఈ సమస్య తీవ్రంగా ఉంటోంది. ముఖ్యంగా ఎక్కువ సేపు కూర్చుని ఉద్యోగాలు లేదా వ్యాపారాలు చేసే వారికి ఈ సమస్య అధికంగా ఉంటోంది. దీనికి కారణాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

వెన్ను నొప్పి ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది?

 శరీరం నిటారుగా నిలబడేందుకు ఊతమిచ్చే కీలకమైన భాగం వెన్నెముక. దీనికి ఇరు వైపులా 33 వెన్నుపూసలతో తయారై ఉంటుంది. వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్‌లు.. మనం  వంగడానికి , నిలబడడానికి  ఉపయోగపడతాయి. ఇవి అరిగి పోవడం వల్ల, లేదా డిస్క్‌లు పక్కకు తొలగి నరాలను ఒత్తిడికి గురి చేయడం వల్ల గానీ   నొప్పి వస్తుంది.  వెన్నుపూసల మధ్న  కార్టిలేజ్‌ లో వచ్చేమార్పులు కూడా నొప్పికి ఓ  కారణం కావచ్చు. అంతే  కాకుండా సాధారణంగా రోజువారీ చేసే పనుల వల్ల కూడా వెన్ను  నొప్పి వస్తుంది.  కుర్చీలలో అసంబద్ధ భంగిమల్లో కూర్చోవడం ...  డెస్క్ దగ్గర ఎక్కువ సేపు కదలకుండా పని చేయడం.. వల్ల కూడా వెన్ను నొప్పి రావొచ్చు. దీన్ని నివారించుకునేందుకు ఆఫీసులలో  పని చేసే  ఉద్యోగులు, వాహనాలు నడిపే డ్రైవర్లు, ఎక్కువగా  కూర్చొని పని చేసే ఉద్యోగులు. . సరైన భంగిమల్లోనే కూర్చోవడం అలవాటు చేసుకోవాలి.  తద్వారా వెన్నుపూసపై భారం పడకుండా   ఉండి నొప్పి వచ్చే అవకాశం తక్కువవుతుంది. కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు కుర్చీ తగినంత ఎత్తులో ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఒకే భంగిమలో  అరగంట కంటే ఎక్కువ సేపు కూర్చోకుండా వీలైనప్పుడల్లా కాసేపు లేచి అటు ఇటు నడవడం మంచిది. 

 వెన్నెముక కింది భాగంలో వచ్చే నొప్పిని నడుము నొప్పిగా వ్యవహరిస్తారు. అంటే లోయర్ బ్యాక్ పెయిన్ అన్నమాట. దీన్ని నియంత్రించడానికి  రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. నిపుణుల పర్యవేక్షణ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. నడుం నొప్పిని చిటికెలో నివారించేందుకు  ఎలాంటి మార్గాలు లేవు.. కాబట్టి వెన్నుపూస, నడుం కండరాలను దృఢంగా ఉండేలా చేసుకోవడం ఒక్కటే సరైన మార్గమని గుర్తు పెట్టుకోవాలి. ఇందుకోసం ఫిజియోథెరపిస్టులు లేదా వ్యాయామ నిపుణులు  చేసిన   సూచనలు పాటించడం మంచిది. 

స్థూలకాయం వెన్నునొప్పికి కారణమవుతుందా?

వెన్ను నొప్పి ఎక్కువగా  ఉన్నప్పుడు నడుము భాగం మీద వేడినీటితో కాపడం పెట్టడం లేదా  ఐస్‌ బ్యాగ్‌ పెట్టడం చేయాలి. అవసరమైతే ఫిజియోథెరపిస్టుల వద్ద  చికిత్స  తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఊబకాయం ఉన్నవారిలోనూ, అధిక  బరువులు ఎత్తేవారిలోనూ వెన్నునొప్పి సమస్య ఉత్పన్నమవుతుంది. స్థూలకాయం వల్ల వెన్నెముక పైన అదనపు భారం పడుతుంది. అలాంటి వారు శారీరక బరువును నియంత్రణలో ఉంచుకుంటే మంచిది. వెన్ను నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు అధిక బరువులు ఎత్తడం మంచిది కాదు. అలాగే ఒకేసారి హఠాత్తుగా వంగడం లేవడం కూడా చేయకూడదు. 

Read Also: యోగాతో మానసిక శారీరక ఆరోగ్యం

వ్యాయామం, శారీరక శ్రమ అలవాటు లేనివాళ్లు బరువులు ఎత్తితే కూడా నడుము నొప్పి పుడుతుంది. ఒక్కసారిగా బరువులు ఎత్తడం వల్ల కండరాలు, ఎముకలపై ఒత్తిడి పెరిగి తీవ్రమైన  నొప్పి కలిగే అవకాశం ఉంది. రాత్రి  పడుకునేటప్పుడు కూడా సరిగ్గా పడుకోవాలి.  పూర్తిగా వెన్నుపూసకు విశ్రాంతి లభించేలా సరైన భంగిమలో పడుకోవడం చాలా ముఖ్యం. అలాగే  పడుకునే పరుపు కూడా వెన్నెముకకు హాయినిచ్చేలా ఉండాలి. 

Read Also: రోజూ బాదం తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?

See Also:వీడియో: కొమురం భీముడో పాట ఇలా క్రియేట్ చేశారా?



Post a Comment

Previous Post Next Post