మీ ఫోన్ లో స్పేస్ రన్నింగ్ ఔట్ ప్రాబ్లమ్ వస్తే ఏం చేయాలి?
ఈ రోజుల్లో అందరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఫోన్లో మెమొరీ కూడా ఎక్కువగానే ఉండేలా చూసుకుంటున్నారు. ఐతే సోషల్ మీడియాలో మెసేజ్ లు, ఫోటోలు, లింక్ లు, పీడీఎఫ్ ఫైల్స్ .. ఇలా చాలా వచ్చి మొబైల్ లో స్టోర్ కావడంతో ఫోన్ మెమొరీ, ఎస్డీ కార్డు(SD card) మెమొరీ కూడా సరిపోవడం లేదు. దీంతో ఫోన్లలో స్పేస్ రన్నింగ్ ఔట్ (Storage Space Running Out) ప్రాబ్లమ్ ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలని తర్జన భర్జన పడుతున్నారు.
ఫోటోలు వీడియోలు డిలీట్ చేస్తే సరిపోతుందా?
స్పేస్ రన్నింగ్ ఔట్ సమస్య రాగానే చాలా మంది చేసే పని ఫోన్లో ఉన్న అవసరం లేని ఫోటోలు, వీడియోలను డిలీట్ చేస్తుంటారు. కొంత మంది అవసరం లేని యాప్స్ కూడా డిలీట్ చేస్తుంటారు. దీంతో సమస్య పరిష్కారమైందని అనుకుంటారు. నిజానికి తాత్కాలికంగా ఈ సమస్య పరిష్కారమవుతుంది. కానీ మళ్లీ ఒక రోజులోనో లేదా రెండు రోజుల్లోనూ సేమ్ ప్రాబ్లమ్ రిపీట్ అవుతుంది. దీంతో తలపట్టుకుంటారు. మరోవైపు మొమొరీ కార్డులో స్పేస్ ఉన్న విషయాన్ని గుర్తించినా.. ఈ సమస్య ఎందుకు వస్తుందో చాలా మందికి అర్థం కాదు. ఫోన్ మెమొరీలో 1జీబీ(GB) కంటే మెమొరీ తగ్గినప్పుడు ఈ సమస్య ఉత్పన్నమవుతుంది.
ఇక అసలు విషయం ఏంటంటే.. యాప్స్, ఫోటోల కోసం ఖర్చయ్యే మెమొరీకి ఈ సమస్యకు సంబంధం లేదు. మొబైల్ లో ర్యాండమ్ ఆక్సెస్ మెమొరీ(RAM) తగ్గిపోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఇందుకోసం ఫోన్ లో క్లియర్ క్యాషే చేయాల్సి ఉంటుంది. దీన్ని మ్యాన్యువల్ గా, ఆటోమేటిక్ పద్ధతిలోనూ చేయవచ్చు.
ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం
ముఖ్యంగా ఫోన్లలో రెండు రకాల మెమొరీ స్టోరేజ్ ఉంటుంది. ఒకటి ఎక్స్టర్నల్ మరొకటి ఇంటర్నల్. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న హై-ఎండ్ ఫోన్లలో ఎక్స్టర్నల్ మొమొరీ ఆప్షన్ ఇవ్వడం లేదు. కాబట్టి ఎక్కువగా ఇంటర్నల్ స్టోరేజీపైనే ఆధారపడాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువగా యాప్స్ ఇన్ స్టాల్ చేసినా, ఫోటోలు, వీడియోలు డౌన్ లోడ్స్ చేసినా మెమొరీ త్వరగా అయిపోతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. అవసరం ఉన్నవి మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు యాప్స్ లో క్లియర్ క్యాషే చేయడం వల్ల స్పేస్ రన్నింగ్ ఔట్ ప్రాబ్లమ్ నుంచి తప్పించుకోవచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
* క్లియర్ యాప్ క్యాషే చేయాలంటే..
1. ముందుగా ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.
2. అప్లికేషన్ పై క్లిక్ చేయాలి.
3. ఇన్స్టాల్ అయిన యాప్స్ కనిపించిన తర్వాత క్లియర్ క్యాషే చేయాల్సిన యాప్ ఎంచుకోవాలి.
4. క్లియర్ క్యాషే క్లిక్ చేసి OK కొట్టాలి.
5. ఇలాగే ప్రతి యాప్ లో క్లియర్ క్యాషే చేయాలి.
6. క్లియర్ డేటాను క్లియర్ చేయవద్దు. అలా చేస్తే యాప్ లో ఉన్న ఇంపార్టెంట్ ఫైల్స్ డిలీట్ అవుతాయి.
Read Also: సర్కారు వారి పాట సినిమా నుంచి మురారి వా.. వీడియో సాంగ్ రిలీజ్
* క్లియర్ క్యాషే చేయడానికి మరో పద్ధతి కూడా ఉంది. ఐతే SD Card ఉన్న ఫోన్లకు మాత్రమే పని చేస్తుంది. ఇందుకోసం ఫోన్ లోని ఇంటర్నల్ స్టోరేజీలో ఉన్న ఫోటోలు, వీడియోలు, యాప్స్ ను SD Cardలోకి మూవ్ చేయడం వల్ల ఇంటర్నల్ స్టోరీజీ ఖాళీ అవుతుంది. అప్పటికీ స్పేస్ రన్నింగ్ ఔట్ సమస్య పరిష్కారం కానిపక్షంలో స్మార్ట్ ఫోన్ క్లీనర్, స్పీడ్ బూస్టర్, ఆప్టిమైజర్ అప్లికేషన్ ను పరిశీలించవచ్చు. ఇది RAM optimizer మాత్రమే కాకుండా జంక్ ఫైల్స్ క్లీన్ చేస్తుంది. పైగా గేమ్ బూస్టర్ లా పని చేస్తుంది. అంతే కాదు డూప్లికేట్ ఫైల్స్ ను క్లీన్ చేయడంలో సహాయపడుతుంది.
* యాప్స్ ను SD Cardకి మూవ్ చేయడం
ఎక్స్టర్నల్ మెమొరీ ఉన్న ఫోన్ వాడే వారికి స్పేస్ క్లియర్ చేసుకోవడం మరింత ఈజీ అవుతుంది. ఫోన్ మెమొరీలో ఉన్న యాప్స్ కొన్నింటిని SD card మెమొరీలోకి మూవ్ చేయడం వల్ల ఫోన్లో కొంత మెమొరీ ఖాళీ అవుతుంది. దాన్ని ఈ కింద స్టెప్స్ లో చూపిన విధంగా చేసుకోవాలి.
1. ఫోన్ సెట్టింగ్ లోకి వెళ్లి యాప్స్ ఓపెన్ చేయాలి.
2. యాప్స్ అన్నింటినీ సైజ్ ఆధారంగా క్రమబద్ధీకరించాలి.
3. అవసరమైన యాప్స్ ను Move to SD card బటన్ నొక్కి పంపించాలి.
4. ఒకవేళ కొన్ని యాప్స్ మూవ్ కాలేనిపక్షంలో అవి SD cardలోకి వెళ్లవని అర్థం.
* అవసరం లేని యాప్స్ అన్ ఇన్స్టాల్ చేయడం
మనలో చాలా మందికి విపరీతంగా యాప్స్ ఇన్స్టాల్ చేయడం అలవాటుగా ఉంటుంది. కానీ కొద్దికాలం తర్వాత వాటితో పెద్దగా పని ఉండకపోవచ్చు. అలాంటి యాప్స్ ఇంటర్నెట్ డేటాను కూడా అనవసరంగా ఉపయోగించుకుంటూ ఉంటాయి. పైగా వాటితో ఇంటర్నల్ స్టోరేజీ పెరిగిపోతుంది. కాబట్టి అలా అవసరం లేని యాప్స్ ను అన్ ఇన్స్ టాల్ చేయడమే మంచిది. ఫలితంగా ఇంటర్నల్ స్టోరేజీ మెమొరీ ఖాళీ అవుతుంది. ఫోన్ హ్యాంగ్ అవడం లాంటి సమస్యలకు కూడా చెక్ పడుతుంది.
Read Also: OTTలో సినిమానా...? ఆగండాగండి..
Follow us on: FaceBook Google News