Murari va song released from sarkaruvaripata Mahesh fans in full josh

'సర్కారు వారి పాట' నుంచి మురారి వా.. వీడియో సాంగ్ రిలీజ్


 సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతోంది. ఇప్పటికీ మంచి కలెక్షన్లతో ఉర్రూతలూగిస్తున్న ఈ సినిమాకు మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు చిత్ర యూనిట్ మరో సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. సినిమాలో ఉపయోగించని మురారీ వా అనే ప్రత్యేక గీతాన్ని కూడా జత చేసింది. 

 ఈ పాటలో సూపర్ స్టార్ మహేష్ బాబు, హీరోయిన్ కీర్తి సురేష్ సూపర్ గా డాన్స్ చేశారు. చిత్రీకరణ కూడా అదిరిపోయింది. అలాగే హీరో హీరోయిన్లు వేసుకున్న కాస్టూమ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. నిజానికి ఈ పాటనే సినిమాలో ఉపయోగించాలని చిత్ర నిర్మాతలు, దర్శకుడు తొలుత డిసైడ్ అయ్యారు. ఐతే మెలోడీ సాంగ్ కంటే కాస్త బీట్ ఉన్న పాట అయితే బాగుంటుందని భావించి.. ఈ గీతాన్ని పక్కకు పెట్టేశారు. ఈ పాట స్థానంలో మ...మ.. మ.. మ..మహేశా పాటను రూపొందించారు. ప్రస్తుతం అదే సినిమాలో ఉంది. మ..మ...మహేశా సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా విడుదల చేసిన మురారీ.. వా పాట కూడా చాలా బాగుంది. ఈ మెలోడీ గీతాన్ని ప్రఖ్యాత రచయిత అనంత శ్రీరామ్ రచించారు. శ్రీకృష్ణ, శ్రుతి రంజని, ఎంఎల్ గాయత్రి ఆలపించారు. ఇంకెందుకు ఆలస్యం ఆ పాటను మీరూ చూసేయండి. 




Post a Comment

Previous Post Next Post