కోనసీమ అల్లర్లకు చంద్రబాబు, పవన్ కారణం: జగన్

        కోనసీమ అల్లర్లకు చంద్రబాబు, పవన్ కారణం: జగన్

 


 కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టడంపై జరిగిన అల్లర్లకు ప్రధాన కారణం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ అంటూ ఆరోపించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. సత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని చెన్నే కొత్తపల్లిలో పంటల బీమా పరిహారాన్ని లబ్దిదారులకు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్.. తమది రైతు ప్రభుత్వం చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ హాయంలో చనిపోయిన 458 మంది రైతులకు కూడా పరిహారం అందించామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తుంటే.. చంద్రబాబు, పవన్ అన్నదాతలకు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. 

అంతే కాదు చంద్రబాబు, పవన్ ను తోడు దొంగలుగా అభివర్ణించారు. పచ్చని కోనసీమలో చిచ్చు పెట్టారని విమర్శించారు. క్రాప్ హాలీ డే అంటూ రైతులను రెచ్చగొడుతున్న ఇలాంటి రాజకీయాలు మనకు అవసరమా అంటూ ప్రశ్నించారు. మూడేళ్లలో వ్యవసాయం కోసం ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నామని జగన్ తెలిపారు. ఇందుకోసం ఇప్పటి వరకు 25 వేల 800 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. టీడీపీ సర్కారుకు వైసీపీ సర్కారుకు తేడా గమనించాలని రైతులను కోరారు. గతంలో పంటల బీమా ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉండేదని జగన్ తెలిపారు. ఇప్పుడు అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.  

Read Also: డెబిట్, క్రెడిట్ కార్డుల ఆన్ లైన్ లావాదేవీలకు కొత్త రూల్స్ 

Follow us on: FaceBook Google News Twitter

Post a Comment

Previous Post Next Post