వీడియో: కొమురం భీముడో పాట ఇలా క్రియేట్ చేశారా?

        కొమురం భీముడో పాట ఇలా క్రియేట్ చేశారా (వీడియో)


 దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన RRR మూవీ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కథనాయకలుగా నటించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్.. తాను నటించిన కొమురం భీమ్ పాత్రలో ఇమిడిపోయారు. ఈ సినిమాలో అన్ని సీన్లు ఒకెత్తయితే.. తారక్ పై చిత్రీకరించిన కొమురం భీముడో.. కొమురం భీముడో పాట అత్యద్భుతంగా ప్రేక్షకులను అలరించింది. 

ఐతే ఈ పాటను ఎలా చిత్రీకరించారు? ఎలాంటి గ్రాఫిక్స్ వాడారు? అనే విషయాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. నిజానికి అంతా గ్రాఫిక్ మాయాజాలమైనప్పటికీ .. సహజత్వానికి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. ప్రతి ఫ్రేమ్ లోనూ అంతలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఐతే ఈ కొమురం భీముడో.. పాటకు ప్రముఖ గ్రాఫిక్ డిజైనింగ్ సంస్థ మకుట గ్రాఫిక్ వర్క్ అందించింది. వారు గ్రాఫిక్స్ ఎలా చేశారనే దాన్ని ఓ వీడియో రూపంలో రిలీజ్ చేశారు. ఆ వీడియో ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తోంది. ఆ వీడియోను మీరు చూడండి.  


Read Also: మెదడు ఆరోగ్యానికి మెరుగైన ఆహారం

Read Also: సర్కారు వారి పాట సినిమా నుంచి మురారి వా.. వీడియో సాంగ్


Post a Comment

Previous Post Next Post