నాన్నకు ప్రేమతో...

                                        నాన్నకు ప్రేమతో...


జన్మనిచ్చింది అమ్మైనా.. 

గుండెలకు హత్తుకుంది నాన్న

గుండెలపై ఆడించింది నాన్న

వేలు పట్టి నడింపించింది నాన్న

తప్పటడుగులు చూసి మురిసింది నాన్న

తప్పుటడుగులు వేస్తే సరిదిద్దింది నాన్న

చిన్నప్పటి నుంచి ప్రతి అవసరం తీర్చింది నాన్న

సమాజంలో ఓ హోదా ఇచ్చింది నాన్న

త్యాగానికి మరో రూపం నాన్న

ఆయన కోపం.. ఆవగింజంత

ఆయన ప్రేమ.. అనంతమంత

బడికి వెళ్లాలని బాదినా ఆయనే.. 

ప్రయోజకుడిలా తీర్చిదిద్దినా ఆయనే..

అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పటికీ 'హీరో' నాన్న

నాకు బ్రతుకునిచ్చావు.. బతకడం నేర్పించావు నాన్నా..

ఇప్పుడిక నావంతు..

ఫలనా వాడి కొడుకని గర్వపడేలా చేస్తా

నీ పుత్రోత్సాహం ఎప్పటికీ అలాగే ఉండేలా చేస్తా

చివరగా.. నా జీవితంలో మొత్తం నువ్వే ఉన్నావు నాన్నా

అందుకే నాన్నకు ప్రేమతో... ఈ నాలుగు అక్షరాల సుమార్చన


Post a Comment

Previous Post Next Post