'అరబిక్ కుత్తు' పాటను అచ్చం అలాగే దింపేసిన ఫ్యాన్స్

'అరబిక్ కుత్తు' పాటను అచ్చం అలాగే దింపేసిన ఫ్యాన్స్


 తమిళ హీరో తలపతి విజయ్ నటించిన సినిమా బీస్ట్ బాక్సాఫీస్ వద్ద ఆవరేజ్ టాక్ తెచ్చుకున్నా.. అందులోని ' మల్లమ్మ పిత్తా పిత్తా దే' పాట మాత్రం ఇంటర్నెట్ ను షేక్ చేసింది. సినిమా విడుదలకు ముందు, ఆ తర్వాత కూడా సగటు సంగీత ప్రియులను కూడా ఉర్రూతలూగించింది. ఆ తర్వాత విడుదలైన వీడియో సాంగ్ కూడా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు అదే పాట మరోసారి సినీ ప్రియులతోపాటు, నెటిజనులను ఆకట్టుకుంటోంది. ఐతే ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఆ పాటను అభిమానులు రీక్రియేట్ చేశారు. తమ డాన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. అచ్చం ఒరిజినల్ సాంగ్ లో ఉన్న విధంగానే కాస్టూమ్స్ ధరించారు. పాట కోసం అలాంటి సెట్ నే రీక్రియెట్ చేశారు. దినేష్, మోనికా అనే ఇద్దరు డాన్సర్లు చేసిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఇప్పటికే దాదాపు 2 లక్షలకు పైగా ఈ వీడియో వ్యూస్ సంపాదించింది. ఆ పాటను మీరూ చూసేయండి. 

 ఈ పాటను అరబిక్ కుత్తు స్టైల్ లో నటుడు శివకార్తికేయన్ రాశారు. దానికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ చక్కటి సంగీతం అందించడమే కాకుండా జోనితా గాంధీతో కలిసి పాట పాడారు. అప్పట్లోనే లిరికల్ వీడియో రిలీజ్ చేస్తే.. దాదాపు 440 మిలియన్ వ్యూస్ ను ఈ పాట సంపాదించుకోవడం విశేషం. కళానిధి మారన్ నిర్మించిన బీస్ట్ సినిమాకు నెల్సన్ దర్శకత్వం వహించారు.


(వీడియో) T Hub 2.0 లోపల ఎలా ఉందో చూశారా?

బ్రెడ్ కొనేటప్పుడు ఇన్ని చూడాలా ? 



Post a Comment

Previous Post Next Post