APలో రాజకీయ అరంగేట్రంపై విశాల్ క్లారిటీ

           APలో రాజకీయ అరంగేట్రంపై విశాల్ క్లారిటీ 


 తమిళ, తెలుగు చిత్రాల్లో దూసుకువెళ్తున్న హీరో విశాల్. ఈ యాక్షన్ హీరో గురించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆయన త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటారని.. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఐతే ఈ విషయంపై విశాల్ క్లారిటీ ఇచ్చారు. 

 సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలన్నీ పుకార్లేనని హీరో విశాల్ కొట్టిపారేశారు. అంతే కాదు వాటిని ఖండిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. పైగా ఇలాంటి వార్తలు ఎక్కడ నుంచి వస్తాయో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి తనను ఇప్పటివరకూ ఎవరూ  సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను సినిమాలతోనే బిజీగా ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాదు ఇప్పట్లో ఏపీ పాలిటిక్స్‌లోకి వచ్చే ఉద్దేశ్యం కానీ.. చంద్రబాబు నాయుడుపై పోటీ చేయాలనే ఉద్దేశం కానీ తనకు లేవని విశాల్‌ తేల్చి చెప్పారు. 

 గతంలో తమిళనాడు రాజకీయాల్లో విశాల్ ప్రత్యక్షంగా పోటీ చేశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తర్వాత జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో విశాల్ నామినేషన్ దాఖలు చేశారు. ఐతే అప్పట్లో ఆయన నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీంతో ఆయనకు పోటీ చేసే అవకాశం దక్కలేదు. 

(వీడియో)మల్లమ్మ పిత్తా పాటను అచ్చంగా దించేసిన ఫ్యాన్స్

మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘సామాన్యుడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు విశాల్‌. ప్రస్తుతం ఆయన ‘లాఠి’, ‘తుప్పరివాలన్-‌ 2’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

ఫోన్ లో స్పేస్ రన్నింగ్ ప్రాబ్లమ్ వస్తే ఏం చేయాలి?

Follow us on: Google News Twitter

Post a Comment

Previous Post Next Post