లైగర్ ట్రైలర్ లాంచ్

                    లైగర్ ట్రైలర్ లాంచ్ 


స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తాజాగా తెరకెక్కిన చిత్రం లైగర్(Liger)... సాలా క్రాస్ బ్రీడ్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్ బ్యానర్లపై హీరోయిన్ ఛార్మీ, దర్శకుడు పూరీ జగన్నాథ్, బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనన్య పాండే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించింది. ప్రపంచ ప్రఖ్యాత బాక్సింగ్ స్టార్ మైక్ టైసన్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించారు. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, థీమ్ సాంగ్ విజయ్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు లైగర్ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేసింది చిత్ర యూనిట్.  





Post a Comment

Previous Post Next Post