టమాటోతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేవి?

            టమాటోతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేవి?


 భారతీయ సంప్రదాయ వంటకాల్లో  అతి ఎక్కువగా ఉపయోగించే కూరగాయ ఏంటో తెలుసా.  అవును.. మీరు ఊహించింది  కరెక్టే. టమాటో. ఇంకా  చెప్పాలంటే  టమాటో లేని వంటిల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే భారతీయ వంటకాల్లో టమాటోకు అంత ప్రాముఖ్యత ఉంది. అలాగే  టమాటో వల్ల  చక్కటి ఆరోగ్య ప్రయోజానాలు కూడా ఉన్నాయి. టమాటోలో యాంటీఆక్సిడెంట్లతోపాటు విటమిన్లు, ఖనిజలవణాలు పుష్కలంగా లభిస్తాయి. అవేంటీ.. వాటి వల్ల  కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

  మనం నిత్యం వంటలో ఉపయోగించే కూరగాయల్లో అతి  ముఖ్యమైనది..  టమాటో. చూడ్డానికి ఎర్రని పండులా ఉండే టమాటోలు..  ఏ కూరలోనైనా వేసుకునే వెసులుబాటు ఉంది. వంట రుచికరంగా తయారు కావడంలో టమాటో కీలకపాత్ర పోషిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. కాస్తంత పులుపు, వగరు దీని ప్రత్యేకత. రుచికి తగ్గట్టుగానే టమాటోలతో మన శరీరానికి కూడా ఎన్నో ఆరోగ్య  ప్రయోజనాలున్నాయి.  

టమాటోలు ఏ ఏ రంగుల్లో లభిస్తాయి?

 ప్రపంచంలో  ప్రతి ప్రాంతంలో పండే పంట టమాటో. అలాగే ప్రపంచంలోని అత్యధికంగా జనం ఉపయోగించే ఏకైక కూరగాయ  టమాటో  అని చెప్పవచ్చు. రంగు, ఆకారాన్ని టమాటోలు వివిధ రకాల్లో లభిస్తాయి. వాటి  రంగు ఆధారంగా టమాటోల రుచి మారుతుంది.  ముఖ్యంగా మనకు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, ఊదారంగుల్లో టమాటోలు లభ్యమవుతాయి. ఐతే టమాటోలు వివిధ రంగుల్లో లభ్యమైనప్పటికీ  ఎక్కువగా ఎరుపు రంగు టమాటోనే ఉపయోగిస్తారు.   

Read Also: సునామీ మళ్లీ వస్తుందా? 

 ఇక టమాటోల ఆరోగ్య ప్రయోజనాల విషయానికొస్తే.. చక్కటి పోషకాలతో ఆరోగ్యాన్ని కాపాడుతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా టమాటోల్లో యాంటీఆక్సిడెంట్లు, పలు రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు లభ్యమవుతాయి. ఇవి శరీరాన్ని హృద్రోగ  సమస్యలు, పలు రకాల  కేన్సర్ల బారిన పడకుండా రక్షిస్తాయి. చర్మ  సౌందర్యాన్ని కాపాడతాయి. కళ్లను సురక్షితంగా ఉంచుతాయి. శరీరంలో ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. 

టమాటోల్లో లభించే లైకోపీన్ ఉపయోగమేంటి?

 టమాటోల్లో మనకు ముఖ్యంగా లభించేది లైకోపీన్. ఇది  ఒక యాంటీఆక్సిడెంట్.  దీని వల్ల శరీరానికి చాలా రకాల ఆరోగ్య  ప్రయోజనాలు ఉన్నాయి. లైకోపీన్.. హృద్రోగ సమస్యలు  రాకుండా చూస్తుంది. అంతే  కాదు కొన్ని రకాల కేన్సర్లు దరి చేరకుండా కాపాడుతుంది. ముఖ్యంగా ప్రోస్టేట్, పెద్దపేగుతోపాటు కడుపులో ఇతర కేన్సర్లు రాకుండా  చేస్తుంది. లైకోపీన్.. కేన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తున్నట్లు పలు అధ్యయనాల్లోనూ నిరూపితమైంది. టమాటోల్లో అధికంగా లభించే లైకోపీన్ చర్మ  సమస్యలను దూరం చేస్తుంది.  ముఖ్యంగా సూర్యరశ్మి కారణంగా చర్మ కణాలు  పాడైపోకుండా కాపాడంలో కీలకపాత్ర  వహిస్తుంది. 

 మరోవైపు టమాటోల నుంచి  మనకు వివిధ రకాల విటమిన్లు కూడా లభ్యమవుతాయి. విటమిన్ A కూడా అధికంగా లభిస్తుంది. ఇది కూడా చర్మ సమస్యలను తగ్గించేందుకు  సహాయం చేస్తుంది. అలాగే విటమిన్ A కారణంగా  కంటి ఆరోగ్యం  కూడా  బావుంటుంది. దృష్టిలోపాలను సరిచేసేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే టమాటోల నుంచి లభించే విటమిన్ B, పొటాషియం గుండె సంబంధ సమస్యలు  రాకుండా  కాపాడతాయి. కొలస్ట్రాల్  స్థాయిలను నియంత్రించి రక్తపోటును క్రమబద్ధీకరిస్తాయి. దీంతో హృద్రోగ సమస్యలు  రాకుండా ఉంటాయి. 

Read Also: డెంగీ జ్వరాలు పెరుగుతున్నాయి.. జర జాగ్రత్త

 ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ టమాటోలు తీసుకోవడం అవసరం. ఎందుకంటే టమాటోల్లో ఉండే క్యాల్షియం, విటమిన్ K ఎముకల బలోపేతానికి చక్కగా తోడ్పడతాయి. విటమిన్ K.. ఎముక  కణజాల  వృద్ధిలో సహాయపడుతుంది. క్యాల్షియం కారణంగా వల్ల ఎముకల్లోని చిన్న చిన్న లోపాలు వాటికవే సర్దుకుంటాయి. 

టమాటోల్లో ఇంకా ఏ పోషకాలు లభిస్తాయి?

 వీటితోపాటు టమాటోల నుంచి  మరిన్ని చక్కటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.  ఫోలేట్, బీటాకెరోటిన్, విటమిన్ C తోపాటు ఆరోగ్యానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్స్ లభ్యమవుతాయి. అంతే  కాదు టమాటోల్లో పీచుపదార్థం అధికంగా లభిస్తుంది. మరోవైపు శరీరానికి కూడా తక్కువ కేలరీలు అందుతాయి. అలాగే  టమాటోలో కొవ్వు ( FAT) చాలా   తక్కువగా ఉంటుంది. కాబట్టి.. ఇన్ని  రకాలుగా  శరీరానికి మేలు చేసే టమాటోలను రోజూ తీసుకోవచ్చు. 

Follow us on:  

నోట్: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల మేరకు ఈ కథనం అందించడం జరిగింది. ఇది అవగాహన కోసం మాత్రమే. వైద్యపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా డాక్టర్లను సంప్రదించడమే మంచిది.

ఈ కథనం మీ స్నేహితులు, బంధువులకు ఉపయోగపడుతుందనుకుంటే కింద వాట్సప్ లింక్ ద్వారా మీ గ్రూపులలో షేర్ చేయండి.




Post a Comment

Previous Post Next Post