గుర్తు పెట్టుకో.. పూరీకి బండ్ల గణేష్ వార్నింగ్

        గుర్తు పెట్టుకో.. పూరీకి బండ్ల గణేష్ వార్నింగ్

 


ఆయన ఏం చేసినా.. ఏం మాట్లాడినా అలాగే ఉంటుంది. బండ్ల గణేషా.. మజాకా అనేట్టు ఉంటుంది.. అదే ఆయన స్టైల్. హైదరాబాద్ లో జరిగిన 'చోర్ బజార్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్.. మళ్లీ తన వాగ్ధాటితో వార్తలకెక్కారు. ఈసారి ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ను ఓ ఆట ఆడుకున్నారు బండ్ల గణేష్. పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరీ హీరోగా చోర్ బజార్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఐతే కుమారుడి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పూరీ జగన్నాథ్ రాకపోవడంతో బండ్ల గణేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందరెందరినో స్టార్లుగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన జగన్.. కొడుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాకుండా ముంబైలో ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు బండ్ల. అంతే కాదు.. పూరీ జగన్నాథ్ కథ రాసుకుని కొడుకు డేట్ల కోసం క్యూలో నిలబడే రోజు వస్తుందని హెచ్చరించారు. ఆ టైమ్ లో నాన్నకు డేట్స్ ఇవ్వవద్దంటూ ఆకాశ్ కు సూచించారు. ఒకవేళ డేట్స్ ఇస్తానన్నా.. తాను దగ్గరుండి మరీ ఇవ్వొద్దని చెబుతానంటూ పూరీకి వార్నింగ్ కూడా ఇచ్చారు బండ్ల గణేష్. 

 ఇటీవలి కాలంలో పూరీ జగన్నాథ్ దంపతుల విడాకుల ప్రచారంపైనా తనదైన శైలిలో స్పందించారు బండ్ల గణేష్. జీవితంలో ర్యాంపులు, వ్యాంపులు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయంటూ తన స్లైల్లో చెప్పారు. 


See Also: రాజమౌళికి ఆ సినిమాలంటే భయమా?

Post a Comment

Previous Post Next Post