రాజమౌళికి ఆ సినిమాలంటే భయమా?

                రాజమౌళికి ఆ సినిమాలంటే భయమా?


 సెన్సేషనల్ డైరెక్టర్, భారతీయ సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన గురించి, ఆయన సినిమాల గురించి తెలియని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయన మన అందిరి కోసం సినిమాలు తీస్తారు. ఐతే అలాంటి దిగ్గజ దర్శకుడికి ఎలాంటి సినిమాలు అంటే ఇష్టం, ఆయన ఎలాంటి సినిమాలు చూస్తారు.. అనే విషయం చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఈ విషయాలను ఆయన ఎప్పుడూ ఎవరితోనూ షేర్ చేసుకోలేదు. అలాగే ఇలాంటి ప్రశ్నలు ఆయన్ను ఎవరూ ఇంత వరకు అడగలేదు. కానీ తనకు ఎలాంటి సినిమాలు అంటే ఇష్టం.. ఎలాంటి సినిమాలు చూస్తాను.. ఎలాంటి సినిమాలంటే భయపడతాను అనే విషయాలను ఆయనే స్వయంగా పంచుకున్నారు. 

హమ్మో హర్రర్ సినిమాలా ?నాకు భయం

 తాజాగా హైదరాబాద్ లో జరిగిన అన్యాస్ ట్యుటోరియల్ వెబ్ సిరీస్ ట్రైలర్ ను దర్శక ధీరుడు రాజమౌళి విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ అనంతరం మాట్లాడిన రాజమౌళి.. తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలను పంచుకున్నారు. హర్రర్ జోనర్ లో తెరకెక్కిన అన్యాస్ ట్యుటోరియల్ వెబ్ సిరీస్ ట్రైలర్ చూస్తుంటే థ్రిల్లింగ్ గా అనిపించిందని చెప్పారు. ఐతే తనకు హర్రర్ సినిమాలు అంటే ఇష్టముండదని.. పైగా ఆ సినిమాలు చూస్తే భయపడతానని కుండబద్ధలు కొట్టారు. కానీ హర్రర్ జోనర్ లో మీరు సినిమా చేస్తారా అని అడిగిన ప్రశ్నకు ఆయన టిపికిల్ గా సమాధానమిచ్చారు. నవరసాల్లోనూ భయానకం కూడా ఒక ఎమోషన్ అంటూ చెప్పుకొచ్చారు. 

Read Also: కడుపు నొప్పి ఉన్నప్పుడు ఏ ఆహారం తినాలి?

అన్యాస్ ట్యుటోరియల్ వెబ్ సిరీస్ జులై 1 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. దెయ్యాలు ఉన్నాయా..? లేవా..? అవి ఉంటే భయం ఎలా ఉంటుంది..? ఒకవేళ అవి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌కి వస్తే ఎలా ఉంటుంది..? అనే చిత్ర విచిత్ర మలుపులతో ఈ వెబ్ సిరీస్ నిర్మించారు. మొత్తంగా ఏడు ఎపిసోడ్స్‌లో ఈ వెబ్ సిరీస్ తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. 

Read Also: కొత్త ఇల్లు కొనేవారు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏవి?

Post a Comment

Previous Post Next Post