Viral video: విద్యార్థినిలతో ఢిల్లీ స్కూల్ టీచర్ డ్యాన్స్

Viral video: విద్యార్థినిలతో ఢిల్లీ స్కూల్ టీచర్ డ్యాన్స్


 విద్యార్థులకు ఆట పాటలు నేర్పించడంలో ఉపాధ్యాయులు ముందుంటారు. ఐతే ఇది ఎక్కువగా ప్రయివేట్ స్కూళ్లలో మాత్రమే జరుగుతుంది.  ప్రభుత్వ పాఠశాలల్లో చాలా అరుదైన విషయం. పైగా గవర్నమెంట్ స్కూళ్లలో సమ్మర్ క్యాంపులు నడిపించడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. ఐతే ప్రభుత్వ పాఠశాలలో సమ్మర్ క్యాంపు సందర్భంగా విద్యార్థినిలతో కలిసి ఓ టీచర్ చేసిన వీడియె నెట్టింట వైరల్ గా మారింది. పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

 ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఈ టీచర్ పేరు మనూ గులాటి. సమ్మర్ క్యాంప్ చివరి రోజున తమ పాఠశాలలో విద్యార్థులతో కలిసి తరగతి గదిలో డాన్స్ చేశారు. కిస్మత్ సినిమాలోని ఎవర్‌గ్రీన్ పాట ‘కజ్రా మొహబ్బత్ వాలా’కు వారంతా లయబద్దంగా వారంతా కాళ్లు కదిపారు. 

Read Also: 16 రకాల ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం

డాన్స్‌తో పాటు ఆమె అందం, అభినయం మరింత ఆకట్టుకుంటోంది. అమ్మాయిలందరూ ఒక క్రమ పద్ధతిలో ఒకరి తర్వాత ఒకరు ఫ్రేమ్‌లోకి వచ్చి డాన్స్ చేస్తూ.. చివరికి టీచర్‌తో పాటు అందరూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తూ చేసిన ప్రదర్శన మనసును హత్తుకుంటోంది. ఈ హృద్యమైన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది.

Read Also: కడుపు నొప్పి ఉన్నప్పుడు ఏం తినాలి?


Post a Comment

Previous Post Next Post