(వీడియో) సరయూ నదిలో భార్యకు ముద్దు పెట్టిన భర్త.. తర్వాతేం జరిగింది?
సరయూ నదిలో ఓ యువ జంట స్నానం చేస్తున్నారు. ఉన్నట్టుండి భర్త.. భార్యకు ముద్దు పెట్టాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న కొంత మంది చూశారు. పవిత్ర సరయూ నదిలో ఇదేం పని అంటూ నిలదీశారు. అంతే కాదు.. అసాంఘీక కార్యకలాపాలు చేస్తున్నావంటూ అతన్ని నదిలో నుంచి బయటకు తీసుకువెళ్లి చెంపలు వాయించారు. అతని భార్య.. వారిని అడ్డుకున్నా ఫలితం లేకపోయింది. ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీయడంతో .. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
अयोध्या: सरयू में स्नान के दौरान एक आदमी ने अपनी पत्नी को किस कर लिया. फिर आज के रामभक्तों ने क्या किया, देखें: pic.twitter.com/hG0Y4X3wvO
— Suneet Singh (@Suneet30singh) June 22, 2022
ఐతే ఈ ఘటనపై అయోధ్య పోలీసులు కూడా స్పందించారు. నిందితులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
प्रभारी निरीक्षक कोतवाली अयोध्या पुलिस द्वारा वायरल वीडियों में घटित घटना का स्वतः संज्ञान लेकर अभियोग पंजीकृत किया गया, आरोपी व्यक्तियों को चिन्हित कर आवश्यक विधिक कार्यवाही की जा रही है।
— AYODHYA POLICE (@ayodhya_police) June 22, 2022