50 ఏళ్లు దాటిన తర్వాతా చురుకుగా ఉండడం సాధ్యమేనా?

 50 ఏళ్లు దాటిన తర్వాతా చురుకుగా ఉండడం సాధ్యమేనా?


 వయసుపైబడిన కొద్దీ రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తుండడం సహజమే. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన తర్వాత కొంత మందికి వ్యక్తిగత పనులు కూడా చేసుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. ఐతే ఈ సమస్యను నివారించుకునేందుకు కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. వయసు పైబడిన తర్వాత శారీరకంగా ఎలాంటి మార్పులు జరుగుతాయి? వాటిని అధిగమించి చురుగ్గా ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటి విషయాలపై అవగాహన పెంచుకోవడం అవసరం. ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం.  

 మధ్య వయసు నుంచి వృద్ధాప్యంలోకి వెళ్తున్నప్పుడు శారీరక శక్తి సన్నగిల్లడం ప్రతి ఒక్కరిలోనూ సాధారణంగా జరిగే ప్రక్రియే. ఇందుకు తోడు రకరకాల అనారోగ్య సమస్యలు కూడా ఉండనే ఉంటాయి. కొంత మందిలో మానసిక సమస్యలు కూడా ఇబ్బంది పెడుతుంటాయి. మరికొందరిలో ఒంటరితనం కూడా వేధిస్తుంది. వయసు పైబడిన తర్వాత శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా రక్తనాళాలు గట్టిపడడం, రక్త ప్రసరణలో వేగం తగ్గడం, శారీరక బరువు పెరగడం లాంటి మార్పులు చూస్తుంటాం. 

 అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ కండరాలు కోల్పోవడం కూడా జరుగుతుంది. ఫలితంగా వృద్ధాప్యంలోకి మళ్లుతున్న వారు ఎక్కువ శక్తిమంతంగా, చురుగ్గా ఉండలేరు. ఐతే జీవన గమనంలో ఈ మార్పులు రాకముందే శారీరక ఆరోగ్యంపై దృష్టిసారించినట్లయితే కాలక్రమేణా వచ్చే ఈ మార్పులను కాస్త అధిగమించి చురుగ్గా ఉండేందుకు అవకాశం ఉంది. ఇందుకోసం జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. సమతుల పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడంతోపాటు ప్రతి రోజూ క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామాలు చేయాలి. 

ఎలాంటి వ్యాయామాలు చేయడం మంచిది?

  ప్రతి రోజూ ఉదయం లేదా సాయంత్రం నడవడం, ఈత కొట్టడం, సైకిల్ తొక్కడం వంటివి అభ్యాసన చేయడం వల్ల రోజంతా చురుగ్గా ఉండవచ్చు. ఇలా ప్రతి రోజూ కనీసం అర గంట సేపైనా వారంలో 5 రోజుల వరకు  అభ్యాసన చేయాలి. అలాగే ఇలా తేలికపాటి వ్యాయామాలతోపాటు మెట్లు ఎక్కడం, పెంపుడు జంతువులను వాకింగ్ కు తీసుకువెళ్లడం, తోటపని చేయడం కూడా ఉపయోగపడుతుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగేందుకు,  కండరాలు చురుగ్గా కదిలేందుకు స్ట్రెచింగ్ ఎక్సర్ సైజ్ లు చేయడం తోడ్పడుతుంది. వయసు పెరిగిన వారిలో సరిగ్గా నిలబడడం కూడా కష్టంగా ఉంటుంది. ఐతే ఈ వ్యాయామాలు చేయడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.  

ఎయిరోబిక్స్ చేయడం మంచిదేనా?

 ఇక కండరాల దృఢత్వాన్ని పెంచుకునేందుకు రకరకాల వ్యాయామాలు అందుబాటులో ఉన్నాయి. అందులో  వెయిట్ లిఫ్టింగ్, ఎలాస్టిక్ బ్యాండ్స్, హ్యాండ్ డంబెల్స్, కెటిల్ బెల్స్ ముఖ్యమైనవి. వీటితో కండరాలు బలోపేతం అవడమే కాకుండా ఛాతీ, భుజాలు, చేతులు, కాళ్లకు కూడా చక్కని వ్యాయామం అందుతుంది. ఐతే వీటితో వ్యాయామం చేసేటప్పుడు మధ్యలో కాస్త విరామం ఇవ్వడం మంచిది. మరోవైపు వయసు పైబడిన వారికి ఎయిరోబిక్స్ వ్యాయామాలు కూడా చక్కగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఆక్సిజన్ స్థాయి పెంచుకోవడం, పేగుల్లో పేరుకుపోయిన కొవ్వును బయటకు పంపేయడం లాంటివి ఎయిరోబిక్స్ వల్ల సాధ్యమవుతాయి. వీటితోపాటు తరచుగా బాస్కెట్ బాల్, టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్ లాంటి క్రీడలు ఆడడం ఉపకరిస్తుంది. 

రాజమౌళికి ఆ సినిమాలంటే భయమా? Click on Image


Read Also: మెదడు ఆరోగ్యానికి మెరుగైన ఆహారం ఏది?

రేపటి నుంచి చేద్దామని వాయిదాలు వేయవద్దు

 ప్రతి రోజూ వ్యాయామాలు చేయడం మంచిదే అయినా.. చాలా మంది రేపటి నుంచి చేద్దాం అని వాయిదాలు వేస్తూ ఉంటారు. అంతే కాదు ఈ  వయసులో వ్యాయామాలు ఏంటనే అపోహ కూడా చాలా మందిలో ఉంటుంది. ఐతే వైద్యుల సలహా మేరకు 90 ఏళ్ల వయసులోనూ వ్యాయామాలు మొదలు పెట్టవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక వయసు పైబడుతున్న వారు శారీరక వ్యాయామాలతోపాటు మెదడు కూడా చురుగ్గా పని చేసేందుకు వ్యాయామాలు చేయడం మంచిది. అంటే ఫజిల్స్ సాల్వ్ చేయడం, లెక్కలతో కూడిన గేమ్స్ ఆడడం, చదరంగం లాంటివి అన్నమాట. వీటివల్ల మానసిక ఉల్లాసం లభించడంతోపాటు మతిమరుపు లాంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.  

Read Also: 16రకాల ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం

Read Also: యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం


Post a Comment

Previous Post Next Post