వీడియో: అమెరికాలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
అగ్రరాజ్యం అమెరికాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. చాలా మంది అమెరికన్లు, మిగతా దేశాల వారితోపాటు భారతీయులు పెద్ద సంఖ్యలో కలిసి మెలిసి యోగా దినోత్సవాన్ని అట్టహాసంగా జరుపుకున్నారు. అంతేకాదు ఈ ఏడాది థీమ్ కు అనుగుణంగా సర్వమానవాళి మానవత్వం కోసం అన్న విధంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం విశేషం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళల కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళలంతా చాలా వరకు భారతీయ సంప్రదాయ కట్టుబొట్టును అలంకరించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరోవైపు పలువురు సంస్కృత శ్లోకాలు కూడా ఆలపించడం కొసమెరుపు. ఇప్పుడా వీడియోను మీరూ చూడండి. అమెరికాలో మన భారతీయ సంప్రదాయం ఎలా వెల్లివిరుస్తుందో అర్థమవుతుంది.
Read Also: ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటి?