Man shapeup as dog in Japan కుక్కలా మారిన మనిషి

                            కుక్కలా మారిన మనిషి 



వెర్రి వేయి విధాలు..  అని ఓ పాత సామెత ఉంది. ఇప్పుడు అది పది వేల విధాలు అన్నా తప్పులేదు అనిపిస్తోంది. ఆధునికతకు మారుపేరైన జపాన్ లో ఓ వ్యక్తి.. తన వింత కోరికను తీర్చుకునేందుకు ఏకంగా 12 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. కుక్కలా మారేందుకు ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేశాడంటే అతని కోరిక ఎంత బలీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

సాధారణంగా ఏ దేశంలోనైనా పెంపుడు జంతువులను ప్రేమగా చూసుకుంటారు. ముఖ్యంగా కుక్కల విషయానికి వస్తే.. చాలా మంది వాటి యజమానులు అన్నీ తామైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు జపాన్ లో టోకో అనే వ్యక్తి.. ఏకంగా తనను తానే కుక్కలా మారిపోయేందుకు నిశ్చయించుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా తన బలీయమైన కోరిన తీర్చే వ్యక్తి లేదా సంస్థల కోసం వెదికాడు. ఈ  క్రమంలో అతనికి సినిమాలకు, టీవీ షో లకు కాస్టూమ్స్ డిజైన్ చేసే జెప్పెట్ అనే సంస్థ గురించి తెలిసింది. ఇక ఏముంది.. వారి వద్దకు వెళ్లి తన కోరికను తెలియపరిచాడు. అంతే కాదు ఎంత ఖర్చయినా ఫరవాలేదు.. తన కలను నిజం చేయాలని కోరాడు. ఐతే ఆ సంస్థ ఇప్పటి వరకు ఎన్నో రకాల మస్కట్ పాత్రల దుస్తులు డిజైన్ చేసినప్పటికీ ఇలాంటి పని చేసింది లేదు. ఐనప్పటికీ కొత్త రకం పనిని చేసేందుకు ముందుకు వచ్చింది. ఇంకే ముంది టోకో కొలతలకు సరిపోయే విధంగా మాంచి కోలి జాతి కుక్కలా డ్రెస్ డిజైన్ చేసే పని ప్రారంభించింది. మొత్తంగా 40 రోజుల్లో పని పూర్తి చేసింది. 

 చివరకు టోకోకు ఈ డ్రెస్ వేసి... అచ్చం కోలి జాతి కుక్క అని భ్రమించేలా వర్క్ చేసింది జెప్పెట్ సంస్థ. అంతే కాదు ఇందుకు సంబంధించిన వీడియోను సైతం తమ సంస్థ యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

Also Read: యోాగాతో మానసిక శారీరక ఆరోగ్యం

Facebook


Post a Comment

Previous Post Next Post