తెలంగాణలో మరో కలికితురాయి T-Hub 2.0
![]() |
Image Credit: Twitter |
హైదరాబాద్ ఐటీ కారిడార్ లో మరో కలికితురాయి చేరింది. ఐటీ రంగంలో అంకుర సంస్థలకు మరింత ప్రోత్సాహం ఇచ్చేందుకు T-Hub 2.0 అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ T-Hub 2.0ను ప్రారంభించారు. T-Hub 2.0ను 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 276 కోట్లతో నిర్మించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ భవనాన్ని నిర్మించడం విశేషం. భారత దేశంలోనే ఇదే అతి పెద్ద ఇంక్యూబేషన్ సెంటర్ గా ఇది రూపుదిద్దుకుంది. అంతే కాదు ప్రపంచంలో రెండో అతి పెద్ద ఇంక్యూబేషన్ సెంటర్ కావడం మరో విశేషం.
T-Hub 2.0లో ఏకంగా 15 వందల స్టార్టప్ సంస్థలకు చోటు కల్పించే అవకాశం ఉంది. ఐటీ రంగంలో సేవలు అందించే స్టార్టప్స్ కంపెనీలు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి, మీటింగ్ లు పెట్టుకోవడానికి, మెంటార్స్, పెట్టుబడిదారులను కలిసేందుకు ఇది స్పేస్ అందిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లో T-Hub ఫస్ట్ ఫేజ్.. సేవలు అందిస్తోంది. కొత్తగా నిర్మించిన T-Hub 2.0 దీనికి అదనం. T-Hub 2.0తో హైదరాబాద్ ఐటీ కారిడార్ లో ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ఊపందుకుంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
Read Also: ఆరోగ్యంపై ఆందోళన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
2015లో T-Hub ఫస్ట్ ఫేజ్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం అది 1100 జాతీయ, అంతర్జాతీయ స్టార్టప్ లకు సేవలు అందిస్తోంది. 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన T-Hub ఫస్ట్ ఫేజ్ ఇప్పటికే దాదాపు రూ. 1800 పెట్టబుడులను ఆకర్షించింది. అలాగే హైదరాబాద్‌లో 2,500 మందికి పైగా ఉపాధిని కల్పించింది. 300 స్టార్టప్ సంస్థలు ఇక్కడి నుంచి వినియోగదారులకు, కంపెనీలకు, ప్రభుత్వాలకు తమ సేవలు అందిస్తున్నాయి. T-Hub ఫస్ట్ ఫేజ్ ను తెలంగాణ ప్రభుత్వం.. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ భాగస్వామ్యంతో నిర్మించింది.
Read Also: రోజూ బాదం తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
మీ ఫోన్ స్పేస్ రన్నింగ్ ఔట్ అని వస్తోందా? ఇలా చేయండి