తలరాత మార్చగలిగేది చదువు మాత్రమే: జగన్
![]() |
Image Credit: twitter |
మనిషి తలరాత మార్చగలిగిన శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అమ్మ ఒడి నిధుల జమ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులపై చదువుపై ఖర్చు చేసే ప్రతీ పైసా ఒక గొప్ప పెట్టుబడి అవుతుందని పేర్కొన్నారు.
మూడేళ్ల కాలంలో అక్షరాల 19,617 కోట్ల రూపాయలు నేరుగా విదార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేసామని తెలిపారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పాదయాత్ర చేసిన సందర్భంగా ప్రతీ తల్లి కష్టాన్ని దగ్గరుండి చూశానని జగన్ చెప్పారు.
పిల్లలు బడికి వెళితేనే చదువు వస్తుంది లేకుంటే చదువు రాదని.. అందుకే 75శాతం హాజరు కావాలని జీఓ ఇచ్చినట్లు సీఎం జగన్ వెల్లడించారు. విద్యార్థుల హాజరు పరంగా కేవలం 1.14 శాతం తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి నిధులు జమ చేయలేకపోయామని తెలిపారు. ప్రభుత్వం పాఠశాలలాన్ని నాడు నేడు పథకంలో భాగంగా ఉన్నతంగా మార్పు చెందినట్లు ఆయన వెల్లడించారు. విద్యార్థుల కోసం తమ ప్రభుత్వం అనేక పనులు చేస్తున్నా విపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయన్నారు జగన్. ఐతే అలాంటి వారు ఏనాడైనా పిల్లలకు గానీ, తల్లులకు గానీ ఒక్క పైసా అయినా ఇవ్వగలిగారా అంటూ ప్రశ్నించారు. మేనిఫెస్టోను భగవత్ గీతగా, ఒక బైబుల్గా, ఒక ఖురాన్గా వైసీపీ ప్రభుత్వం భావించిది కాబట్టే.. ఇవన్నీ చేస్తున్నామని తెలిపారు.
త్వరలోనే 4.7లక్షల మంది 8వ తరగతి విద్యార్థులకు రూ. 12వేల విలువైన ట్యాబులు అందజేస్తామని జగన్ చెప్పారు. అలాగే పిల్లలకు రాబోయే రోజుల్లో టీవీ లేదా డిజిటల్ బోర్డులను నాడు నేడు పథకంలో భాగంగా ఏర్పాటు చేసి ఉన్నత విద్యను అందజేస్తామన్నారు. జగనన్న వసతి దీవెనలో భాగంగా 21లక్షల 55 వేల మంది కళాశాల విద్యార్థులకు పూర్తి ఫీజ్ రియంబర్స్ మెంట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాకు జగన్ వరాలు
కోడి రామ్మూర్తి స్టేడియంకు రూ. 10 కోట్లు మంజూరు
జిల్లా కలెక్టరేట్ నిర్మాణంకు రూ.69 కోట్లు
ఆమదాలవలస రహదారికి అదనంగా రూ. 18 కోట్లు మంజూరు
లిఫ్ట్ ఇరిగేషన్ స్కెమ్ కు రూ.120 కోట్లు మంజూరు
వంశధార ప్రాజెక్టును ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా జాతికి అంకితం చేస్తామని సీఎం జగన్ వెల్లడించారు.
Viral Video: హవాలా మనీ ఎలా తరలిస్తున్నాడో చూస్తారా?
Read Also: అమర్ నాథ్ యాత్ర ఎప్పటి నుంచో తెలుసా?