(వీడియో) పోలీసులకు షాక్.. హావాలా మనీతో యువకుడి పట్టివేత

(వీడియో) పోలీసులకు షాక్.. హావాలా మనీతో యువకుడి పట్టివేత


 చెన్నైలో హావాలా మనీతో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన యువకుడు పట్టుబడ్డాడు. అతని హవాలా మనీ తీసుకెళ్తున్న విధానాన్ని చూసి రైల్వే పోలీసులే షాక్ తిన్నారు. 

నిజానికి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో పోలీసులు గంజాయి అక్రమ రవాణా కోసం నిఘా పెట్టారు. కానీ వారికి అనూహ్యంగా ఓ యువకుడు హవాలా మనీ తీసుకుని వెళ్తూ పట్టుబడ్డాడు. అంతే కాదు పెద్ద మొత్తంలో నగదును ఎవరికీ కనిపించని విధంగా తీసుకుని వెళ్తున్నాడు. ఇందుకోసం చొక్కా లోపల ఓ బ్యాగ్ ఏర్పాటు చేసుకున్నాడు. దానిలో పలు జిప్ లు కూడా అమర్చాడు. వాటిలో కట్టలు కట్టలుగా డబ్బు పేర్చి పెట్టుకున్నాడు. ఆ బ్యాగ్ ను ఛాతీ, కడుపు చుట్టూ వచ్చే విధంగా అమర్చుకున్నాడు. దీంతో కడుపు ఉబ్బెత్తుగా ఉన్నప్పటికీ పెద్దగా ఎవరికీ అనుమానం రాని విధంగా అమర్చుకోవడం విశేషం. యువకుడు షర్ట్ విప్పుతున్నప్పుడు చూసి పోలీసులే ఖంగుతిన్నారు.

  ప్రస్తుతం ఆ యువకున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ డబ్బు ఎవరిది, ఎక్కడికి తీసుకు వెళ్తున్నాడు, ఎవరికి ఇవ్వనున్నాడు.. అనే విషయాలను ఆరా తీస్తున్నారు. మొత్తంగా యువకుని నుంచి రూ. 60 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు చెన్నై సెంట్రల్ రైల్వే పోలీసులు వెల్లడించారు. గంజాయి, అక్రమ మద్యం సరఫరా చేసే స్మగ్లర్ల కోసం తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో హవాలా మనీని గుర్తించినట్లు తెలిపారు. 



Read Also: శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల చేయనున్న TTD

See Also: పూరీకి బండ్ల గణేష్ వార్నింగ్

Post a Comment

Previous Post Next Post