F3 Movie review F3 సినిమా ఎలా ఉందంటే..

                            F3 సినిమా ఎలా ఉందంటే.. 



 ఫన్.. ఫ్రస్ట్రేషన్.. కాన్సెప్ట్ తో అలరించిన సినిమా F2. తాజాగా ఇదే చిత్రాన్ని అనుసరిస్తూ.. అవే పాత్రలతో దర్శకుడు అనిల్ రావిపూడి F3 చిత్రాన్ని తెరకెక్కించారు. గత చిత్రంలో కంటే మోర్ ఫన్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపుదిద్దుకుంది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? F2 ను మించిన హాస్యాన్ని అందించిందా?

 * సినిమా క‌థేంటంటే?

 ఇంటి నిండా స‌మ‌స్య‌లతో బాధపడుతున్న వెంకీ.. వాటి నుంచి బయటపడేందుకు అడ్డదారుల్లో సంపాదించడంపై దృష్టి పెడతాడు. అలాగే వ‌రుణ్ తేజ్.. చేతిలో డబ్బు లేకపోయినా.. ధనవంతుడిగా బతకాలని కోరుకుంటాడు. కానీ డబ్బు సంపాదించడంపై కాకుండా.. ఓ డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని తన కలను నెరవేర్చుకోవాలని భావిస్తాడు. మరోవైపు సరిగ్గా ఇలాంటి భావాలే ఉన్న హీరోయిన్ మెహ్రీన్‌.. వరుణ్ కు దగ్గరవుతుంది. ఐతే ఇద్దరూ డబ్బున్న వారి పిల్లల్లా నటిస్తూ ఒకరికొకరు దగ్గరవుతారు. మరోవైపు వ‌రుణ్ డ‌బ్బున్న‌వాడిగా క‌నిపించేందు కోసం వెంకీ ఇల్లు తాక‌ట్టుపెట్టి మ‌రీ పెట్టుబ‌డి పెడ‌తాడు. కానీ త్వరలోనే ఒకరు చేసిన మోసం ఒకరికి తెలుస్తుంది. ఈ క్రమంలో మరింత అప్పుల్లోకి కూరుకుపోతారు. ఆత్మ‌హ‌త్య చేసుకోవాలని భావిస్తున్న తరుణంలో  వ్యాపార‌వేత్త ముర‌ళీశ‌ర్మ‌ గురించి తెలుస్తుంది. ఆయన తన వార‌సుడి కోసం వెదుతుకున్న విషయం తెలుసుకుని అక్కడికి ఈ బ్యాచ్ అంతా క్యూ కడతారు. ఐతే వీరిలో ఎవరిని వారసుడిగా స్వీకరించారు అనేదాన్ని తెరమీద చూడాలి. 

* ఎలా ఉందంటే?

 సినిమాలో పాత్ర‌ల‌తో క‌లిసి ప్ర‌యాణం చేస్తే F2ని మించిన ఆనందాన్ని ఆస్వాదించొచ్చు. మొత్తంగా డబ్బుపై వ్యామోహంతో పాత్రలన్నీ అలరిస్తాయి. తద్వారా వచ్చే వినోదాన్ని హృద్యంగా తెరకెక్కించడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. ఇక వెంకీ, వరుణ్ తేజ్ ల మేనరిజమ్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. 

 రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ర‌ఘుబాబు, సునీల్‌, అలీ, ప్ర‌గ‌తి, అన్న‌పూర్ణ‌మ్మ‌, వై.విజ‌య‌... ఇలా అందరూ ఎవరి పరిధిలో వాళ్లు వినోదం పంచేందుకు శాయశక్తులా కృషి చేశారు.  త‌మ‌న్నా, మెహ్రీన్‌, సోనాల్ చౌహాన్ అల్ల‌రితోపాటు పూజా హెగ్డే ప్రత్యేక గీతం ఆక‌ట్టుకుంటుంది. 




Post a Comment

Previous Post Next Post