అబ్దుల్ కలామ్ చెప్పిన అద్భుతమైన ప్రేరణాంశాలు
అబ్దుల్ కలామ్(Abdul Kalam).. భారత మాజీ రాష్ట్రపతి. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా(Missile man of India). పీపుల్స్ ప్రెసిడెంట్(Peoples President).టీచర్... ఇలా ఆయన్ను భారతీయులంతా గుర్తు పెట్టుకున్నారు. భారత 11వ రాష్ట్రపతిగా 2002 నుంచి 2007 వరకు సేవలందించిన ఆయన పీపుల్స్ ప్రెసిడెంట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. నేడు(July 27) ఆయన 7వ వర్ధంతి... కాబట్టి భారతీయులంతా ఆయన చేసిన సేవలను గుర్తు తెచ్చుకుంటున్నారు. తమిళనాడులోని రామేశ్వరంలో పుట్టిన ఆయన.. స్వయంకృషితో అంచలంచలుగా ఎయిరోస్పేస్ సైంటిస్ట్ స్థాయికి ఎదిగారు. అంతే కాదు భారతదేశ రక్షణ మరియు అంతరిక్ష పరిశోధన అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. అలాగే భారత రాష్ట్రపతిగానూ పని చేశారు. కానీ పిల్లలకు పాఠాలు చెప్పడం అంటేనే ఆయన ఎక్కువగా ఇష్టపడేవారు. జూలై 27, 2015న ఆయన హఠాత్తుగా కన్నుమూశారు. దీంతో దేశం ఒక గొప్ప శాస్త్రవేత్త, ఒక గొప్ప ఉపాధ్యాయుడు, ఒక గొప్ప నాయకుడిని కోల్పోయినట్లయింది.
అయితే భారత పౌరుల భవిష్యత్తు కోసం, తరతరాల అభివృద్ధి కోసం చెప్పిన అత్యంత స్ఫూర్తిదాయకమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని తెలుసుకుందాం.
* సంకల్పం అనేది చాలా గొప్పదని ఆయన బలంగా నమ్మేవారు. నిరాశ, నిస్పృహలను అడ్డుకునే శక్తిగా దాన్ని ఆయన అభివర్ణించారు. అంతే కాదు విజయానికి సంకల్పమే అత్యంత బలీయమైన శక్తి అని చెప్పేవారు.
* యువత ఎప్పుడూ రాజీ ధోరణి అవలంబించవద్దు. అలాగే తాము చేసే పనిని చిన్నగా ఊహించుకోవద్దని చెప్పేవారు.
* ఎవరైనా మొదటి విజయం తర్వాత విశ్రాంతి తీసుకోవద్దు. ఎందుకంటే రెండోసారి విఫలమైతే మొదటి విజయం కేవలం అదృష్టమేనని చెప్పేటందుకు చాలా మంది ఎదురు చూస్తుంటారు.
* మనం.. రేపటి మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ రోజును త్యాగం చేద్దామని పిలుపునిచ్చారు.
* కలలు కనండి.. అవి కొద్ది కాలంలోనే ఆలోచనలుగా రూపాంతరం చెందుతాయి.. ఆ తర్వాత కార్యరూపం దాలుస్తాయని చెప్పేవారు.
* విజయం సాధించాలనే సంకల్ప బలం మీలో ఉంటే వైఫల్యం ఎప్పటికీ అధిగమించదని చెప్పేవారు.
* మీ మిషన్ లో విజయం సాధించాలంటే.. లక్ష్యం పట్ల ఏకాగ్రత చాలా అవసరం అనేవారు.
* వైఫల్యం నుంచి నేర్చుకోవాలని చెప్పేవారు. ఎందుకంటే..FAIL అంటే First Attempt In Learning అని చెప్పేవారు.
* తరగతి గదిలోని చివరి బెంచీలలో దేశంలో అత్యుత్తమంగా ఆలోచించే వారు కనిపిస్తారనేవారు.
* “చురుకుగా ఉండండి! బాధ్యత తీసుకోండి! మీరు విశ్వసించే వాటి కోసం పని చేయండని చెప్పేవారు.
Follow us on: Google News Twitter
Join Telegram Channel👉https://t.me/URnewstag