లైగర్ నుంచి 'వాట్ లగా దేంగే.. ' సాంగ్ రిలీజ్
ఇందులో భాగంగా సినిమాలో మరో పాటను సినిమా యూనిట్ విడుదల చేసింది. 'వాట్ లగా దేంగే..' అంటూ హీరో విజయ్ దేవరకొండ పాడే పాటను రిలీజ్ చేశారు.
వీ ఆర్ ఇండియన్స్.. హమ్ కిసీసే కమ్ నహీ..హే మ్యాన్ మేరే సాత్ ఆ జా.. జాయేంగే .. లడేంగే... వాట్ లగా దేంగే.. అంటూ సాగుతుందీ పాట. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ పాటలో విజయ్ దేవరకొండ బాక్సింగ్ ఫైట్ చేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
సినిమా అంతా ముంబై బ్యాక్ డ్రాప్ లో తీశారు. వీధుల్లో చేసిన పోరాటాలు.. ఆ తర్వాత కిక్ బాక్సర్ గా దేశానికి ప్రాతినిథ్యం వహించే సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే సినిమా చిత్రీకరణలో పూరీ జగన్నాథ్ మార్క్ కనిపిస్తోంది. ఈ సినిమాలో ప్రముఖ నటి రమ్యకృష్ణ హీరో విజయ్ దేవరకొండకు తల్లి పాత్రలో నటించారు. మాస్ ప్లస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా అలరించిన ట్రైలర్ లో ఆమె పలికిన డైలాగ్స్ ఉర్రూతలూగిస్తున్నాయి. ముఖ్యంగా.. ఒక లయన్ కి టైగర్ కి పుట్టిండాడు.. క్రాస్ బ్రీడ్ సార్ నా బిడ్డ అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇక హీరో విజయ్ దేవరకొండకు సినిమాలో నత్తి ఉన్నట్లు తెలుస్తోంది. వాట్ లగా దేంగే పాటలోనూ అదే నత్తితో డైలాగ్స్ ఉన్నాయి.
ఈ సినిమాలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బాక్సర్ మైక్ టైసన్ ముఖ్య పాత్రలో నటించారు. ఆగస్టు 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్ బ్యానర్లపై హీరోయిన్ ఛార్మీ, దర్శకుడు పూరీ జగన్నాథ్, బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనన్య పాండే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించింది.