ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం ప్రాముఖ్యత ఏంటి?

ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం ప్రాముఖ్యత ఏంటి?

ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని ఏటా జూలై 28న జరుపుకుంటారు. ఆరోగ్యకరమైన సమాజానికి.. ఆరోగ్యకరమైన వాతావరణం కావాలనేది దీని మూల సూత్రం. అంటే భూమిపై ఉన్న సహజ వనరులన్నీ సంరక్షించాలనేది ప్రధాన ఉద్దేశ్యం. సహజ వనరులలో గాలి, ఖనిజాలు, మొక్కలు, నేల, నీరు, వన్యప్రాణులు ఉన్నాయి. ఈ వనరులను సంరక్షించడం ద్వారా పర్యావరణ వ్యవస్ల వైవిధ్యం కోల్పోకుండా ఉంటుంది. అలాగే జీవరాశుల భవిష్యత్ తరాన్ని రక్షించినట్లు అవుతుంది. 

ప్రతి రోజూ ప్రకృతి మనకు అవసరమైన వాటిని అందిస్తుంది. భూమిపై జనాభా పెరుగుతున్న కొద్దీ ప్రకృతి నుంచి ఎక్కువగా తీసుకోవడం పెరిగిపోయింది. ఇది కాలక్రమంలో మనుషుల బాధ్యతారాహిత్యానికి కూడా దారి తీస్తోంది. ఫలితంగా ప్రకృతి నుంచి తీసుకోవడమే కానీ తిరిగి ఇవ్వలేని స్థితికి పరిస్థితులు మారిపోయాయంటే అతిశయోక్తి కాదు. దీంతో సహజ వనరులన్నీ మనుషుల బాధ్యతరాహిత్యం వల్ల నాశనం అవుతున్నాయి. ఫలితంగా భవిష్యత్ తరాల మనుగడకే ఇది ముప్పుగా పరిణమించే అవకాశం ఏర్పడుతోంది.  కాబట్టి జీవ వైవిధ్యాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన బాధ్యత ఉంది. 

ప్రకృతిని పరిరక్షించాలంటే ఏం చేయాలి?

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి

ఈ రోజుల్లో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఐతే ఈ ప్లాస్టిక్ అనేది పర్యావరణానికి విషతుల్యం లాంటిది. కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. వాటి స్థానంలో ప్రకృతి అనుకూలంగా ఉండే వస్తువులను వాడకంలోకి తీసుకురావాలి. 

నీటిని రక్షించాలి 

తాగు నీరు ప్రతి జీవికి ప్రాణాధారం. దీన్ని చాలా ప్రాంతాల్లో వృధా చేస్తున్నారు. ఇప్పటికే వాతావరణ మార్పుల కారణంగా తాగు నీటి లభ్యత తగ్గిపోయింది. ఉన్న కొద్దిపాటి నీటిని కూడా వృధా చేయడం అవివేకమే అవుతుంది. కాబట్టి నీటిని వృధా చేయకుండా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. నీటి పరిరక్షణ కోసం చేసే చిన్న చిన్న పనులే పెద్ద మార్పును సృష్టిస్తాయి. ముఖ్యంగా వినియోగం లేనప్పుడు నల్లాలు ఆఫ్ చేయడం మర్చిపోకుండా చేస్తే గ్యాలన్ల నీటి వృధాను అరికట్టవచ్చు. 

e-wasteను రీసైక్లింగ్ చేయాలి 

కాలం మారుతున్న కొద్దీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల వినియోగం పెరిగిపోయింది. కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లు, గేమింగ్ డివైజ్ లు..  ఇలా చాలా వాటినే మనం వాడుతున్నాం. ఐతే ఎలక్టానిక్ గ్యాడ్జెట్లు పాతవి కాకుండానే వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేస్తున్నాం. ఫలితంగా చాలా మంది ఇళ్లల్లో ఈ- వేస్ట్ అలాగే మిగిలిపోతోంది. ఇది ప్రకృతికి హానికరం. వీటిని రీసైక్లింగ్ చేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 


Post a Comment

Previous Post Next Post