రామారావు ఆన్ డ్యూటీ ఎలా ఉంది?

    రామారావు ఆన్ డ్యూటీ ఎలా ఉంది? 


తారాగణం

హీరో: మాస్ మహారాజా రవితేజ

హీరోయిన్స్: దివ్యాంశ కౌశిక్, రజీష విజయన్

ప్రధాన పాత్రలు: వేణు తొట్టెంపూడి, నరేష్, పవిత్ర లోకేష్, తనికెళ్ల భరణి,రాహుల్ రామకృష్ణ 

సాంకేతిక నిపుణులు 

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ 

ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్ 

ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్

నిర్మాత: సుధాకర్ చెరుకూరి

 మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన సినిమా రామారావు ఆన్ డ్యూటీ(Rama Rao On Duty). ఈ సినిమాకు శరత్ మండవ దర్శకత్వం వహించారు. ఖిలాడీ సినిమా తర్వాత రవితేజ నటించిన చిత్రం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రామారావు ఆన్ డ్యూటీ రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరోవైపు ఈ సినిమాలో చాలా రోజుల గ్యాప్ తర్వాత తొట్టెంపూడి వేణు తెరపై కనిపించారు. సీఐ మురళి పాత్రలో కనిపించారు.  

కథేంటి 

సినిమాలో హీరో రవితేజ డిప్యూటీ కలెక్టర్ క్యారెక్టర్ చేశారు. ఇక రామారావు ఆన్ డ్యూటీ అసలు కథేంటంటే... ఓ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వాన్ని కాదని రైతులకు పరిహారం చెల్లించే విషయంలో సబ్ కలెక్టర్ గా ఉన్న రామారావు ఎమ్మార్వోగా డీమోట్ అవుతాడు. అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలో ఉన్న తిప్పసముద్రం మండలానికి బదిలీ అవుతాడు. ఐతే తన ఊరు కూడా అదే కావడం విశేషం. ఆ ఊళ్లో ఉన్న మాలిని(రజిషా విజయన్) .. తన భర్తకు సంబంధించిన ఆస్తులు బదిలీ చేయాలని తరుచూ తహసీల్దార్ కు దరఖాస్తు పెట్టుకుంటుంది. ఓ రోజు ఆ అర్జీలు చూసిన రామారావు.. మాలిని ఇంటికి వెళ్తాడు. మాలిని తన మాజీ ప్రియురాలు. ట్రాన్స్ ఫోర్ట్ కంపెనీలో పనిచేసే భర్త(చైతన్య కృష్ణ) కనిపించకుండా పోవడంతో ఒంటరిదైపోతుంది. మాలిని భర్తతోపాటు మరో 21 మంది కనిపించకుండాపోవడం.. రామారావు ఆ కేసును వ్యక్తిగతంగా దర్యాప్తు చేయడం సినిమా కథాంశం. ఐతే ఆ విచారణలో రామారావు ఏం తెలుసుకున్నాడు? పోలీసులు చేయలేని పని రామారావు ఎలా చేశాడనేది తెరపై చూడాల్సిందే. చివరలో కథ కాస్త అసంపూర్తిగా అనిపిస్తుంది. ఐతే పార్ట్ -2 ఉంటుందా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక సినిమాలో "ఆయుధం మీద ఆధారపడే నీ లాంటి వాడి ధైర్యం వాడే ఆయుధంలో ఉంటుంది..ఆయుధంలా బ్రతికే నా లాంటి వాడి ధైర్యం అణువణువునా ఉంటుంది" , "నేను లక్కుల మీద లాటరీల మీద డిపెండ్ అయ్యే వాణ్ని కాదు.. నా వర్క్ మీద డిపెండ్ అయ్యే వాణ్ని" అంటూ హీరో రవితేజ చెప్పిన డైలాగ్స్ సినిమాకే హైలెట్. మరోవైపు పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. మొత్తంగా సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. 

బలాబలాలు

సినిమాకు శరత్ మండవ అందించిన కథ, పవర్ ఫుల్ డైలాగ్స్ బలంగా నిలిచాయి. అలాగే మాస్ పల్స్ తెలిసిన రవితేజ యాక్షన్ ప్రధాన బలమని చెప్పవచ్చు. యాక్షన్ సీన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 




Post a Comment

Previous Post Next Post