హైదరాబాద్‌లో ఇళ్ల రిజిస్ట్రేషన్లు జోరు మీద ఉన్నాయా?

             ఇళ్ల రిజిస్ట్రేషన్లు జోరు మీద ఉన్నాయా?


 హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ జోరందుకుందా? అవుననే అంటున్నాయి నివేదికలు. ఈ ఏడాది కాలంలో భాగ్యనగరంలో నివాసాల రిజిస్ట్రేషన్లు ఏకంగా 48 శాతానికి పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం గత ఏడాది కాలంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య 48 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. దీని విలువ రూ.4,288 కోట్లుగా కంపెనీ అభివర్ణించింది. అంతే కాదు ప్రతి నెలలో రిజిస్ట్రేషన్లు 15 శాతం పెరుగుతున్నాయని నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. అంటే ప్రతి నెలలో దాదాపు 7014 గృహాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయని తెలిపింది. మరోవైపు సరాసరి ధర కలిగిన గృహాల రిజిస్ట్రేషన్లలోనూ పురోగతి కనిపించిందని కంపెనీ వెల్లడించింది. ముఖ్యంగా 2023 మొదటి 6 నెలలతో పోలిస్తే 2024 తొలి 6 నెలల్లో ఇది 21 శాతం ఎగబాకిందని తెలిపింది. అంటే 1000 స్వేర్ ఫిట్ల నుంచి 2000 స్కేర్ ఫిట్స్ కలిగిన గృహాలకు వినియోగదారులు ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చారని నివేదికలో నైట్ ఫ్రాంక్ వెల్లడించింది.

 

Post a Comment

Previous Post Next Post