(బిగ్ బ్రేకింగ్)'అగ్నిపథ్'పై తగ్గేదేలే.. నోటిఫికేషన్ విడుదల

                'అగ్నిపథ్'పై తగ్గేదేలే.. నోటిఫికేషన్ విడుదల


దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పై అగ్గి రాజుకుంటున్న వేళ... భారత త్రివిధ దళాలు 'తగ్గేదే లే'దనే సంకేతాలిచ్చాయి. ఈ క్రమంలో అగ్నివీర్ ల నియామకానికి భారత ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా భారీ నిరసనలు కొనసాగుతున్న తరుణంలోనే వివరణాత్మక నోటిఫికేషన్ ఇచ్చింది. జులై నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఇందులో స్పష్టంగా పేర్కొంది. అంతే కాదు... అగ్నివీర్ లకు ఇచ్చే వేతనాల వివరాలు, సెలవులు, సర్వీసు నిబంధనలతోపాటు అన్ని వివరాలు నోటిఫికేషన్ లో పొందుపరిచింది. 

 మరోవైపు ఎయిర్ ఫోర్స్, నేవీలో కూడా త్వరలోనే అగ్నివీర్ నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. ముఖ్యంగా భారత వాయుసేన(IAF) నోటిఫికేషన్ ఈ నెల 24న  వెలువడనుంది. ఇక భారత నావికాదళానికి సంబంధించిన నోటిఫికేషన్ రేపు (JUN 21 ) వచ్చే అవకాశం ఉంది.

Read Also: మీ ఫోన్ లో స్పేస్ రన్నింగ్ ఔట్ ప్రాబ్లమ్ వస్తే ఏం చేయాలి?

See Also: (వీడియో)విద్యార్థినిలతో స్కూల్ టీచర్ డాన్స్

Post a Comment

Previous Post Next Post