సూర్యకు కమల్ కాస్ట్లీ గిఫ్ట్
విక్రమ్ మూవీ బ్లాక్ బ్లాస్టర్ హిట్ కావడంతో హీరో కమల్ హాసన్ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. సినిమా సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తోపాటు సహ నటుడు హీరో సూర్యకు కాస్ట్లీ గిఫ్ట్ లు అందించాడు.
ముఖ్యంగా హీరో సూర్యకు అత్యంత ఖరీదైన రోలెక్స్ వాచ్ ను గిఫ్టుగా ఇచ్చాడు కమల్. విక్రమ్ సినిమాలో హీరో సూర్య రోలెక్స్ పాత్రలో నటించాడు. డ్రగ్ మాఫియా లీడర్ రోలెక్స్ పాత్ర సినిమా చివరి భాగంలో ఎంట్రీ ఇస్తుంది. ఆ పాత్రలో నటించిన సూర్య దాదాపు 3 నిముషాలపాటు పర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. ఐతే హీరో కమల్ కోసమే తాను ఆ పాత్రలో నటించినట్లు హీరో సూర్య తెలిపాడు. పైగా ఆ పాత్ర చేసినందుకు గానూ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని సమాచారం. అందుకే సూర్యకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఖరీదైన గిఫ్టు ఇచ్చి ఆశ్చర్యపరిచాడు కమల్.
ఐతే కమల్ అందించిన గిఫ్ట్ తో హీరో సూర్య కూడా ఫుల్ ఖుషీ మీద ఉన్నాడు. థ్యాంక్యు అన్నయ్య అంటూ ట్విట్టర్ వేదికగా ఆ ఆనందాన్ని పంచుకున్నాడు సూర్య. ఇక కమల్ ఇచ్చిన గిఫ్ట్ Rolex Day-Date 40 Rose Gold President మోడల్ అని తెలుస్తోంది. దీని విలువ దాదాపు 60 లక్షలకు పైగా ఉంటుందని ఫ్యాన్స్ లో చర్చ నడుస్తోంది. మరోవైపు గిఫ్ట్ తోనే కాకుండా విలక్షణ నటుడు కమల్ హాసన్ మరో సర్ ప్రైజ్ విషయం చెప్పాడు. త్వరలోనే హీరో సూర్యతో కలిసి ఓ సినిమాలో నటిస్తానని తెలిపాడు.
ఇక చిత్ర యూనిట్ లోని కొంత మందిని కూడా లోక నాయకుడు ఆశ్చర్యంలో ముంచెత్తాడు. దర్శకుడు లోకేష్ కనగ రాజ్ కు ఖరీదైన లెక్సస్ కారును బహుమతిగా ఇచ్చాడు.
అంతే కాదు విక్రమ్ సినిమాకు పని చేసిన 13 మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు ఖరీదైన బైకులు అందించాడు. మరోవైపు విక్రమ్ మూవీ రిలీజైన 4 రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.
Read Also: తెలంగాణ ఆర్టీసీ మరో బాదుడు
Read Also: సర్కారు వారి పాట సినిమా నుంచి మురారి వా.. వీడియో సాంగ్ రిలీజ్
Follow us on: FaceBook Google News