కొత్త గ్యాస్ కనెక్షన్ ధర పెంపు

                                LPG కొత్త గ్యాస్ కనెక్షన్ ధర పెంపు 


 ఎల్పీజీ గ్యాస్ వినియోగదారుల ఇంట్లో మళ్లీ మంట పెట్టాయి చమురు కంపెనీలు. ఐతే ఈసారి కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకునే వారి వంతు వచ్చింది. కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకునే  వారికి చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయనే చెప్పవచ్చు. ఎందుకంటే కొత్త గ్యాస్ కనెక్షన్ల డిపాజిట్ ధరను అమాంతంగా పెంచేశాయి. ఏకంగా వంట గ్యాస్ సిలిండర్ కొత్త కనెక్షన్ రూ. 750 పెరగడంతో వినియోగదారులపై భారం విపరీతంగా పడనుంది. అంతే కాదు కొత్త రెగ్యులేటర్ డిపాజిట్ ధరను కూడా రూ.100 మేరకు పెంచారు. అంటే మొత్తంగా కొత్త కనెక్షన్ తీసుకునే వారికి రూ. 850 రూపాయల అదనపు భారం పడుతుందన్నమాట. 

 గతంలో గృహ వినియోగదారులు కొత్త  గ్యాస్ కనెక్షన్ తీసుకునేటప్పుడు డిపాజిట్ ధర సింగిల్ సిలిండర్ కు రూ. 1450 ఉండేది. అది ఇప్పుడు రూ. 750 పెరిగి.. రూ. 2200కు చేరింది. అలాగే రెగ్యులేటర్ ధర రూ. 150 నుంచి రూ. 100 పెరిగి.. రూ. 250కి చేరింది. మొత్తంగా గతంలో సిలిండర్, రెగ్యులేటర్ కు కలిపి రూ. 1600 ఉంటే.. ఇప్పుడు ఆ మొత్తం రూ. 2450 వరకు చేరింది. అలాగే 5 కిలోల సిలిండర్ గ్యాస్ కనెక్షన్ ధరను కూడా చమురు కంపెనీలు సవరించాయి. దీంతో గతంలో రూ. 800కు లభించే కొత్త కనెక్షన్ ఇప్పుడు రూ. 350 పెరిగి రూ. 1150కి చేరింది.

Read Also:  వెన్ను నొప్పి బాధిస్తోందా? ఇలా చేయండి

 ఇక కొత్త కనెక్షన్ తోపాటు రెండు సిలిండర్లు తీసుకోవాలనుకునే వినియోగదారులు కొత్తగా పెంచిన రేటు ప్రకారం సెక్యూరిటీ డిపాజిట్ రూ. 4400 చెల్లించాలి. 

Read Also: రోజూ బాదం తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?


Post a Comment

Previous Post Next Post