(Video)ఆకుపచ్చని ఆకాశం

                            ఆకుపచ్చని ఆకాశం


ఆకుపచ్చని ఆకాశం.. మీరు చదివింది కరెక్టే. ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతున్నాయి. అలాగే ప్రపంచంలో ఏ మూల ఎలాంటి వింత జరిగినా సోషల్ మీడియా పుణ్యమా అని వైరల్ అవుతూ త్వరగానే అందరికీ ఆ ఘటనకు సంబంధించిన వివరాలు అందుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వైరల్ గా మారింది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

 మనం నీలాకాశం లేదా ఎరుపు వర్ణంలో ఉండే ఆకాశాన్ని చూసే ఉంటాం. కానీ అమెరికాలోని డకోటా ప్రావిన్స్ లో ఆకాశం ఆకుపచ్చ రంగులోకి మారింది. ఆగ్నేయం దిశగా కొన్ని ప్రాంతాల్లో ఆకాశం ఆకుపచ్చ వర్ణంలో కనిపించడాన్ని కొంత మంది స్థానికులు తమ సెల్ ఫోన్లలో బంధించారు. వాటిని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నిజానికి ఈ వీడియోలు, ఫోటోలు ఎవరైనా గ్రాఫిక్స్ చేశారేమోనని ముందు చాలా మంది నెటిజనులు సందేహించారు. కానీ అవి నిజమైనవేనని శాస్త్రవేత్తలు తేల్చారు. 

వాతావరణంలో జరిగే అనూహ్య మార్పుల వల్లే ఇలా జరిగి ఉంటుందని తెలిపారు. డకోటా, మిన్నెసొటా, అయోవ నగరాల్లో ఇటీవల బీకరమైన గాలులతో తుపాను బీభత్సం సృష్టించింది. ఆ సమయంలో ఈ ప్రాంతాల్లో డెరెకో ధూళి తుపాను ఏర్పడిందని వాతావరణ శాఖ ధృవీకరించింది. ఫలితంగా ఆకాశం ఆకు పచ్చగా మారినట్లు వెల్లడించింది.  ఓ ట్విట్టర్ యూజర్ పంచుకున్న ఆ వీడియో మీరూ చూడండి. 

ఇదీ చదవండి: గోళ్ల ద్వారా అనారోగ్యాన్ని పసిగట్టవచ్చా? 

   







Post a Comment

Previous Post Next Post