బండి సంజయ్ హౌస్ అరెస్ట్
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని హైదరాబాద్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా ఆయన నిరసనకు పిలుపునిచ్చారు. ఈ రోజు ఉదయం నుంచి సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ వద్ద నిరసన తెలపాలని బీజేపీ నిర్ణయించింది. ఈ క్రమంలో ఆయన జూబ్లీ బస్ స్టేషన్ వద్దకు వెళ్లేందుకు సమాయత్తం అవుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. గృహ నిర్బంధం చేశారు. దీంతో బండి సంజయ్ అనుచరులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఫలితంగా బంజారాహిల్స్ లోని బండి సంజయ్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని గృహ నిర్బంధంలో ఉంచారని తెలుసుకున్న కమలం కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే టీఎస్ఆర్టీసీ భారీగా ఛార్జీలు వసూలు చేస్తూ ప్రజలపై భారం మోపుతోందని విమర్శించారు. తాజాగా మళ్ల టికెట్లు రేట్లు పెంచడం వల్ల సామాన్యులు బస్సు ఎక్కే అవకాశం లేకుండా పోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.
Follow us on: FaceBook Google News Twitter