స్కిప్పింగ్‌తో ఫిట్‌నెస్ సాధించవచ్చా?


Image: pixel

ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం తప్పనిసరి. ఉదయం, సాయంత్రం నడవడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల ఆహారం ద్వారా శరీరానికి అందిన కేలరీలు ఖర్చవుతాయి. మంచి ఫిట్ నెస్(Fitness) సొంతమవుతుంది. దీంతో గుండె సహా ఇతర అవయవాలు సక్రమంగా పని చేస్తాయి. అలాంటి వ్యాయామాల జాబితాలో స్కిప్పింగ్(skipping) కూడా ఒకటి. దీని వల్ల  మంచి ఫిట్ నెస్ సంపాదించుకోవచ్చు. స్కిప్పింగ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

 స్కిప్పింగ్.. ఇదొక ఫిట్ నెస్ మంత్ర అని చెప్పవచ్చు. దీన్ని ఆటల జాబితాలో చేర్చలేం. అలాగే పెద్ద పెద్ద వ్యాయామాల జాబితాలోనూ చేర్చలేం. కానీ స్కిప్పింగ్ అనేది శారీరక ఫిట్ నెస్ కు ఎంతగానో దోహదం చేస్తుంది. నిజానికి చాలా మంది దీన్ని చిన్న పిల్లల  ఆట అని తేలిగ్గా తీసుకుంటారు. కానీ పెద్దవాళ్లు కూడా స్కిప్పింగ్ చేస్తే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరతాయి. 

స్కిప్పింగ్ చేస్తే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయి?

 ఒక్కసారి స్కిప్పింగ్ చేస్తే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు  కలుగుతాయో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. శారీరక సౌష్టవానికి ఇది ఎంత బాగా ఉపయోగపడుతుందో తెలుసుకుంటారు. ఒక్కసారి స్కిప్పింగ్ చేసినప్పుడు.. అది 8 మైళ్లు పరుగుపెట్టినంత ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతే కాదు 20 మైళ్లు సైకిల్ తొక్కిన దానితో సమానమని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక్కసారి స్కిప్పింగ్ చేస్తే దాదాపు 140 కేలరీలు ఇట్టే ఖర్చయిపోతాయి. ఐతే ఈ స్కిప్పింగ్ వర్కౌట్ కనీసం 10 నిముషాలు ఉండేలా చూసుకోవాలి.  అలాగే స్కిప్పింగ్ చేయడానికి పెద్ద పెద్ద పరికరాలు అవసం లేదు. ఒకే ఒక్క స్కిప్పింగ్ రోప్ ( స్కిప్పింగ్ తాడు) ఉంటే సరిపోతుంది. అలాగే తక్కువ సమయంలో వ్యాయామం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అంటే బిజీ  షెడ్యూల్ ఉన్న వారు.. తీరిక లేకుండా పని చేసేవారు సైతం చేసుకోవచ్చన్నమాట. అలాగే పేద్ద గ్రౌండ్ అవసరం లేదు.  పచ్చని పచ్చికపై తక్కువ స్థలంలోనే స్కిప్పింగ్ చేసుకోవచ్చు.  

స్కిప్పింగ్  శరీరాకృతిని ప్రభావితం చేస్తుందా?

 స్కిప్పింగ్ చేసేవారిలో గుండె స్పందన, ప్రతి స్పందన వేగం త్వరగా పెరుగుతుంది.  దీంతో కవాటాల పని తీరు మెరుగుపడుతుంది. అలాగే రక్త ప్రసరణ వేగం త్వరగా పెరుగుతుంది. మరోవైపు మంచి భంగిమ (posture) ఏర్పడుతుంది. ఇది శరీరాకృతిని ప్రభావితం చేస్తుంది. అటు  చేతులపైగా ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎలాంటి బరువులు ఎత్తడం లేకపోయినప్పటికీ చేతుల్లోని కండరాలు, మోచేతులు, మణికట్టు ప్రభావితమవుతాయి. కాళ్లు కూడా మరింత బలోపేతంగా తయారవుతాయి. వెన్నులోని కండరాల్లోనూ చలనం కలుగుతుంది. మొత్తంగా నడుము పైన శరీరభాగం, నడుం కింద శరీర భాగాలన్నింటిలోనూ చురుకుదనం వస్తుంది. 

 తేలికపాటి వ్యాయమాలు మాత్రమే కాకుండా ఎక్కువగా వ్యాయమాలు చేసే వారు కూడా వామప్ లాగా స్కిప్పింగ్ చేసుకోవచ్చు. దీని వల్ల శరీరం త్వరగా వ్యాయామం చేయడానికి సిద్ధమవుతుంది. ఫలితంగా శరీరంలో చురుకుదనం పెరిగి.. అధిక బరువులు ఎత్తుతూ వ్యాయామం చేసినా కానీ గాయాలపాలు కాకుండా కాపాడుతుంది.  

Read Also: ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటి?

స్కిప్పింగ్  ఎవరైనా చేయవచ్చా? 

 స్కిప్పింగ్ ఏ వయసు వారైనా చేసుకోవచ్చు. ఐతే పాదాలు, కీళ్లల్లో సమస్యలు ఉన్న వారు మాత్రం తప్పనిసరిగా వైద్యుల సలహాలు, సూచనల మేరకే స్కిప్పింగ్ చేయాలి. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా వైద్యుల సలహాలు తీసుకోవాలి. నిజానికి డయాబేటీస్ ఉన్న వారికి స్కిప్పింగ్ అనేక ఆరోగ్య  ప్రయోజనాలు కలిగిస్తుంది. రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రణలో ఉండేలా సహాయపడుతుంది. అధికంగా ఉన్న బరువును తగ్గించడం ద్వారా మధుమేహం నియంత్రణలో ఉంటుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. హృద్రోగ సమస్యలు ఉన్న వారు కూడా స్కిప్పింగ్ ప్రాక్టీస్ చేయవచ్చు.  కానీ వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే చేస్తే మంచిది.

Read Also: ఛాతీనొప్పి గుండెపోటు ఒకటేనా?

 స్కిప్పింగ్ వర్కౌట్ చేయడం వల్ల వెన్ను కండరాలు, నడుం భాగం, మోకాళ్లు, పాదాలు, చేతులతోపాటు అన్ని కీళ్లపైనా ప్రభావం పడుతుంది. అలాగే ఉశ్ఛ్వాసనిశ్వాసాలు పెరగడం వల్ల ఊపిరితిత్తుల పని తీరు కూడా  మెరుగుపడుతుంది. మంచి శరీర సౌష్టవం పొందడానికి సహాయపడుతుంది. కాబట్టి రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

ఈ రోజే స్కిప్పింగ్ మొదలు పెట్టేవాళ్లు కింద కామెంట్ బాక్సులో తెలియజేయండి. ఇది మరికొందరికి స్పూర్తిగా నిలుస్తుంది.

Read: బ్రంచ్ అంటే ఏంటో తెలుసా?

నోట్: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల మేరకు ఈ కథనం అందించడం జరిగింది. ఇది అవగాహన కోసం మాత్రమే. వైద్యపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా డాక్టర్లను సంప్రదించడమే మంచిది.

Join our Telegram Channel:👉https://t.me/URnewstag

Follow us on: Google News Twitter 



Post a Comment

Previous Post Next Post