HIVకి టీకా అభివృద్ధి చేసిన ఇజ్రాయెల్

HIVకి టీకా అభివృద్ధి చేసిన ఇజ్రాయెల్


 ఎన్నో ఏళ్లుగా ప్రపంచ మానవాళికి సవాల్ విసురుతున్న HIV వైరస్ కు అడ్డుకట్ట పడే రోజు వచ్చింది. ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు ఇందులో విజయం సాధించారు. సుదీర్ఘ పరిశోధనల అనంతరం హెచ్ఐవీ వైరస్ కు చెక్ పెట్టే టీకాను అభివృద్ధి చేశారు. దీంతో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. 

 ఇజ్రాయెల్ లోని టెల్అవీవ్ యూనివర్శిటీలో హెచ్ఐవీ టీకాపై సుదీర్ఘ పరిశోధనలు జరిగాయి. ఇందులో స్కూల్ ఆఫ్ న్యూరోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్ విభాగాలకు చెందిన పరిశోధకులు పాల్గొన్నారు. వారంతా టైప్- బీ తెల్ల రక్తకణాల ద్వారా అభివృద్ధి చేసిన కణాలు వైరస్ ను తటస్థం చేశాయి. దీంతో హెచ్ఐవీ/ఎయిడ్స్ వైరస్ కు మందు కనుగోనే ప్రక్రియలో ఇది పెద్ద పురోగతి అని చెబుతున్నారు. నిజానికి తెల్ల రక్తకణాల్లోని టైప్ - B కణాలు వైరస్, బ్యాక్టీరియాలకు ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి ఎముక మజ్జలో ఏర్పడతాయి. ఐతే హెచ్ఐవీ వైరస్.. టైప్ బీ కణాలను ఎదుర్కొన్నప్పుడు.. అది వాటిని విభజించడాన్ని ప్రేరేపిస్తుంది. ఈ కారణంగా టైప్ బీ కణాలు నిర్వీర్యమైపోయి శరీరంలో రోగ నిరోధక శక్తి సన్నగిల్లుతుంది. ఐతే తాము టైప్ బీ కణాల్లోని జన్యువులో ప్రతిరోధకాలను సృష్టించడంలో విజయం సాధించామని తాజా పరిశోధనలకు నాయకత్వం వహించిన డాక్టర్ బారెల్ వివరించారు. అంతే కాదు తాము పరిశోధనలో భాగంగా చికిత్స అందించిన వారి శరీరంలో యాంటీబాడీలు పుష్కలంగా ఉత్పత్తయ్యాయని తెలిపారు. తాము చేసిన పరిశోధనలు భవిష్యత్ రోజుల్లో AIDSకు పూర్తి స్థాయిలో మందు ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడతాయని వివరించారు.

Read Also: ఛాతీ నొప్పి.. గుండెపోటు రెండూ ఒకటేనా?

HIVగా వ్యవహరిస్తున్న హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్.. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది. దీనికి ఇప్పటి వరకు సరైన చికిత్స అందుబాటులో లేదు. 

Read also: ఎలాంటి బ్రెడ్ కొనడం మంచిది? 

  

Post a Comment

Previous Post Next Post