ఆరోగ్యంపై హీరో విక్రమ్ క్లారిటీ

            ఆరోగ్యంపై హీరో విక్రమ్ క్లారిటీ


 తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో పరిచయం అక్కరలేని కథానాయకుడు హీరో విక్రమ్. ఇటీవల ఆయనకు ఛాతీలో నొప్పి కారణంగా ఆస్పత్రిలో చేరారు. దీంతో అభిమానులు అంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఐతే వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత హీరో విక్రమ్ కావేరీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మరోవైపు ఆయన తన తాజా సినిమాకు సంబంధించిన కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. 

 హీరో విక్రమ్ తాజాగా నటించిన చిత్రం కోబ్రా. ఈ సినిమా ఆడియో వేడుక సోమవారం (జూన్ 11) నాడు చెన్నైలో ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విక్రమ్.. తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి తన ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని తెలిపారు. ఛాతీలో కొద్దిగా నలతగా ఉండడంతో ఆస్పత్రికి వెళ్లి అవసరమైన పరీక్షలు చేయించుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అటు సోషల్ మీడియా వేదికల్లో తన ఆరోగ్యంపై వచ్చిన పుకార్లపైనా చియాన్ విక్రమ్ సెటైరికల్ గా స్పందించారు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు రకరకాలు థంబ్ నెయిల్స్ ఉపయోగించాయన్నారు. ఎవరో పేషెంట్ ముఖానికి తన ముఖంతో మార్ఫింగ్ చేసి తమకు ఇష్టం వచ్చిన న్యూస్ పబ్లిష్ చేశారన్నారు. ఇలాంటివి చూసి కాస్త బాధ కలిగిందని చెప్పుకొచ్చారు చియాన్. 

ఇక తాజాగా చియాన్ విక్ర‌మ్ న‌టించిన చిత్రం ‘కోబ్రా’ ఆగ‌స్ట్ 11న విడుదల కానుంది. ఈ సినిమాకు అజ‌య్ జ్ఞాన‌ముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్  సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కె.జి.య‌ఫ్‌ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌ గా నటించింది. మరో ఆసక్తికర విశేషం ఏంటంటే ఈ  సినిమాలో విక్ర‌మ్ చాలా గెట‌ప్స్ లో కనిపిస్తారట. ఐతే అవేంటనేది మాత్రం సినిమాలో చూడాలంటున్నారు దర్శక నిర్మాతలు.

Video: రాజమౌళి అలాంటి సినిమాలు చూడరా?

Video:మల్లమ్మ పిత్థా పాటకు అభిమానుల డాన్స్.. చూస్తే  ఎవరైనాఫిదా

  





Post a Comment

Previous Post Next Post