పైనాపిల్ నుంచి లభించే పోషకాలు ఏంటి?

        పైనాపిల్ నుంచి లభించే పోషకాలు ఏంటి?

Image credit: Pixel

 కరోనా తర్వాత.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడం కోసం అందరూ వెతుకుతున్నారు. పోషకాలు నిండిన ఆహారాలనే తీసుకుంటున్నారు. తాజా కూరగాయలు, ఆకుకూరలతోపాటు తాజా పండ్లను మెనూలో చేర్చుకుంటున్నారు. ఐతే తాజా పండ్లలో శరీరానికి మంచి పోషకాలను అందించే పండు  పైనాపిల్. ఇందులో ఉన్న పోషక విలువలు ఏంటి? పైనాపిల్ మన ఆరోగ్యానికి వర ప్రదాయిని ఎలా అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

 పైనాపిల్...  దీన్ని తెలుగులో అనాస పండు అని పిలుస్తారు. తీపి, వగరు, పుల్ల రుచుల సమ్మేళనంగా ఉండే పైనాపిల్.. మన ఆరోగ్యానికి వర ప్రదాయిని అని చెప్పవచ్చు.  శరీర రోగ నిరోధక వ్యవస్థను  పెంపొందించే మంచి పోషకాలు ఇందులో ఉన్నాయి. మన ఆరోగ్యానికి అవసరమయ్యే పలు రకాల విటమిన్లు, ఖనిజలవణాలు దీని నుంచి పుష్కలంగా లభిస్తాయి. తద్వారా  వైరల్, బ్యాక్టిరియా ఇన్ఫెక్షన్ల నుంచి ఆరోగ్యాన్ని  కాపాడుకోవచ్చు. అంతే కాకుండా పైనాపిల్ తీసుకోవడం వల్ల  ఎముకలు మరింత బలోపేతం అవుతాయి. 

పైనాపిల్ తింటే కలిగే ప్రయోజనాలేంటి?

 అనాస పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీని నుంచి 85 శాతం నీరు అందుతుంది. అంతే కాకుండా మనకు విటమిన్ A,విటమిన్ C, విటమిన్ B6, విటమిన్ E, విటమిన్ K ఎక్కువగా  లభిస్తాయి.  ఈ విటమిన్ల ద్వారా ఇమ్యూనిటీ వ్యవస్థకు మరింత బలం చేకూరుతుంది. మరోవైపు పైనాపిల్ లో విటమిన్లు మాత్రమే కాకుండా క్యాల్షియం, ఫోలేట్, ఇనుము ధాతు, మెగ్నీషియం, పాస్ఫరస్, పొటాషియం, జింక్ లాంటి ఖనిజ లవణాలు కూడా పుష్కలంగా లభ్యమవుతాయి.  క్యాల్షియం.. ఎముకల దృఢత్వం కోసం ఉపయోగపడుతుంది. పైనాపిల్ నుంచి లభించే ఇనుము ధాతు రక్త కణాల వృద్ధి కోసం సహాయపడుతుంది. అలాగే మెగ్నిషియం వల్ల శరీరంలో వాపులు  ఏర్పడకుండా ఉంటాయి. ఎముకలు, దంతాలు దృఢంగా తయారు కావాలంటే  క్యాల్షియంతోపాటు పాస్ఫరస్ కూడా అవసరం. ఇది మనకు పైనాపిల్ నుంచి పుష్కలంగా  లభిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచేందుకు పొటాషియం బాగా ఉపయోగపడుతుంది.


పైనాపిల్ తిన్న తర్వాత నాలుకపై దురదకు కారణమేంటి? 

 అలాగే అనాస పండులో బ్రొమేలిన్ అనే ఎంజైమ్ ఎక్కువగా ఉంటుంది.  ఇది జీర్ణక్రియకు తోడ్పాటు అందిస్తుంది. అంతే కాకుండా శరీరంలో వాపులు ఏర్పడకుండా ఉపయోగపడుతుంది. ఆహారం తీసుకున్న తర్వాత పైనాపిల్ ముక్కలు  తీసుకునే వారిలో ప్రొటీన్లు త్వరగా జీర్ణమవుతాయి. పైనాపిల్ లో ఉండే బ్రొమేలీన్ ఎంజైమే దీనికి  కారణం. అనాస  పండు తిన్న వెంటనే నాలుక , పెదాల్లో దురద కలుగుతుంది. బ్రొమేలీన్ ఎంజైమ్.. ప్రొటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది కాబట్టే ఇలా జరుగుతుంది. అలాగే పైనాపిల్ నుంచి తీసిన బ్రొమేలీన్ పదార్థాన్ని పలు రకాల అనారోగ్య సమస్యలకు చికిత్సగా వాడుతున్నారు. ముఖ్యంగా  ఛాతీ నొప్పి, బ్రాంకైటిస్, సైనస్ సమస్యలు, రక్తం గడ్డ కట్టుకుపోవడం, విరేచనాలు, కండరాల్లో వాపుల వంటి సమస్యలు ఉన్న వారికి సప్లింంట్ గా ఇస్తున్నారు. 

 పైనాపిల్ కలిగించే చక్కని ఆరోగ్య  ప్రయోజనాలని చూశారు  కదా. అందుకని మంచి ఆరోగ్యకరమైన జీవనం కోసం పైనాపిల్ ను కూడా మీ మెనూలో చేర్చుకోండి. అనాస  పండును అలాగే తినవచ్చు లేదా పళ్ల రసంలా చేసుకుని తాగవచ్చు. అలాగే వివిధ రకాల సలాడ్లలోనూ దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పడు పలు రకాల వంటల్లోనూ దీన్ని ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఏ రకంగా తీసుకుని అయినా పైనాపిల్ పండులోని ఆరోగ్య  ప్రయోజనాలను సొంతం చేసుకోండి.

ఈ కథనం మీ స్నేహితులు, బంధువులకు ఉపయోగపడుతుందనుకుంటే కింద వాట్సాప్ లింక్ ద్వారా గ్రూపులలో షేర్ చేయండి.

నోట్: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల మేరకు ఈ కథనం అందించడం జరిగింది. ఇది అవగాహన కోసం మాత్రమే. వైద్యపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా డాక్టర్లను సంప్రదించడమే మంచిది.

  




Post a Comment

Previous Post Next Post